వివాహం.. ప్రతి మనిషి జీవితంలో వచ్చే కీలక ఘట్టం. అందుకే పెద్దలు పెళ్లంటే నూరెళ్ల పంట అని అంటారు. అందులోనూ ఈ వేడుకలో వధూవరుల జాతకాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. జన్మరాశుల బట్టి వారి గుణగణాలు ఆధారపడి ఉంటాయని నమ్ముతారు. అందుకే జన్మ రాశులకు సరిపడే ఇతర రాశులకు చెందిన వారితోనే వివాహాలు జరపడానికి మొగ్గుచూపుతారు.

Video Advertisement

మకర రాశి వారు గొప్ప లక్ష్యాలను కలిగి ఉంటారు. వీరు తమ అందరితోనూ తమ హృదయాన్ని పంచుకోలేరు. తమ మనసును అర్థం చేసుకోగల భాగస్వామిని కావాలి. తమ భాగస్వామి తమకు మంచి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటారు. మకర రాశి వారిలో నిజాయితీ, నమ్మకం, పేరు ప్రతిష్టలు ఎక్కువే. కలలను సాకారం చేసుకోడానికి సహకరించే వారికోసం అన్వేషిస్తారు.

capricorn sign women qualities..!!

మకర రాశి వాళ్లు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అదే విధంగా ఈ రాశి వాళ్ళు అందర్నీ ఇష్ట పడతారు కూడా. ఇతరులుని బాగా అభినందించడం కూడా బాగా తెలుసు అలానే వాళ్ళని వాళ్ళు సరదాగా ఎలా ఉంచుకోవాలో కూడా తెలుసు. అలాగే వీరి మనసు ఎంతో లోతైనది. వీరు చూడటానికి అమాయకంగా కనిపిస్తారు.. కానీ ఎంతో పట్టుదల కలిగినవారు. అలాగే మంచి మాటకారులు కూడా.

capricorn sign women qualities..!!

అలాగే మకర రాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. వారు కోపంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు గనక వారిని రెచ్చగోడితే పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంది. లేదంటే వీరి కోపం తాటాకు మంట వంటిది. వీరి నిజమైన రూపాన్ని దగ్గరివారికి మాత్రమే చూపిస్తారు. అలాగే వారి మనసు బాలేనపుడు భాగస్వామి తనకు సపోర్ట్ గా ఉండాలి అనుకుంటారు. వీరికి తమ తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం.

capricorn sign women qualities..!!

మకర రాసి వారు తమ ప్రేమను బయట పెట్టరు. అలాగే సొంతవాళ్ళు ఏదైనా ఒక మాట అంటే వారి మనసు విరిగిపోతుంది. అలాగే భాగస్వామి మీద ఒక మాట పడనివ్వరు. వీరు ఓపికగా పనులను చేస్తారు. వైవాహిక జీవితం లో అభిప్రాయ బేధాలు వచ్చినా సర్దుకొని అన్యోన్యంగా జీవిస్తారు. వీరికి కాస్త ఆసరా ఇస్తే ఎన్నో విజయాలను సాధిస్తారు.