ఒక స్త్రీకి అత్యంత ఆనందాన్ని కలిగించే విషయం తాను తల్లి కాబోతున్నాను అని తెలియడం. అలాగే ఆ సమయం లో ఎన్నో ఆందోళనలు కూడా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ప్రసవం అయ్యే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు భర్త కూడా ఎంతో సహకరించాలి.

Video Advertisement

గర్భిణీ స్త్రీ ఆలోచనలు ఆమె కడుపులో పెరుగుతున్న శిశువుపై ప్రభావం చూపుతాయి. భార్య గర్భవతి అయినప్పటి నుంచి భర్త కేరింగ్‌ అనేది ఎంతో ముఖ్యం. ఎంత కేరింగ్‌ తీసుకుంటే మీపై అంత ప్రేమ పెరుగుతుంది. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఒక భర్త రాసిన లవ్ లెటర్ ఒకటి వైరల్ గా మారింది. అందులో ఏం రాసి ఉందో ఇప్పుడు చూద్దాం..

నా ప్రియమైన భార్యకి,

నా జీవితం లో నువ్వొక సూపర్ హీరో. రోజు రోజుకి నీపై అభిమానం, ప్రేమ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం సెకండ్ ట్రైమిస్టర్ లో ఉన్నావు. నువ్వు ఎంతో అందం గా కనిపిస్తున్నావు. నీకు ఇంతకు ముందు నచ్చిన ఆహారం ఇప్పుడు నచ్చట్లేదు. అర్థరాత్రుళ్లు నిద్రపోలేకపోతున్నావు. వేళ కానీ వేళల్లో ఆహారం తింటున్నావు. నీలో ఈ మార్పులన్నీ నాకు నచ్చుతున్నాయి.

a letter to pregnant wife..!!
నీలో మరో జీవి పెరుగుతుంది అనేది అద్భుతం గా అనిపిస్తోంది. మన బిడ్డకి ఇప్పటికే చేతులు, కాళ్ళు, వేలి ముద్రలు తయారయిపోయాయి. మన బిడ్డ కూడా నువ్వు చేసే ప్రతి చర్య నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. కారులో మనం ప్రయాణిస్తున్నప్పుడు..నువ్వు మన బిడ్డని ఎంత భద్రం గా చూసుకుంటున్నావో చూస్తూనే ఉన్నాను. నేను చేసే పొరపాట్లకు నువ్వు కోపగించుకోకుండా.. వాటిని సరదాగా తీసుకోవడం నాకు నచ్చుతోంది.

a letter to pregnant wife..!!

నాకు అప్పుడప్పుడు మన బిడ్డ గురించి కొంత ఆందోళన కలుగుతోంది. నేను మన బిడ్డని సరిగ్గా చేసుకోగలనా.. లేదా అన్న అనుమానం నన్ను తొలిచేస్తోంది. మన జీవితం రానున్న రోజుల్లో ఎలా మారబోతుందో తలచుకుంటుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతోంది. ఇవన్నీ కాకుండా.. ముందుగా నీకు థాంక్ యు చెప్పాలి అనుకుంటున్నా.

a letter to pregnant wife..!!

ఇటువంటి ఫీలింగ్స్ ని నాకు ఇచ్చినందుకు థాంక్ యు. నా పిచ్చి ప్రశ్నలకు విసుక్కోకుండా.. నన్ను భరించినందుకు థాంక్ యు. త్వరలో ముగ్గురం అవుతున్న మన ఫామిలీ ప్రేమతో నింపుతానని నీకు మాట ఇస్తున్నాను. దీనికి మనస్ఫూర్తిగా థాంక్ యు.