ప్రేమ చాలా అందమైన అనుభూతి. అదే సమయంలో ప్రేమ బంధం కూడా చాలా సున్నితమైనది. అందువల్ల ప్రేమ బంధాన్ని బలంగా ఉంచడానికి, కలకాలం కొనసాగించడానికి.. భాగస్వాములిద్దరూ నిజాయితీగా ఉండటం ఉత్తమం. నిజాలు దాయకుండా, ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఉండాలి. లేదంటే.. ఏదో ఒక సందర్భంలో మనస్పర్థం చెలరేగి.. అదికాస్తా విడిపోయేందుకు దారి తీస్తుంది. అయితే, ప్రస్తుత కాలంలో బాంధవ్యాలకు అర్థమే లేకుండా పోతోంది. ఎప్పుడు ఎవరితో రిలేషన్‌లో ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కలవడం క్షణాల్లోనే.. విడిపోవడం క్షణాల్లోనే జరిగిపోతుంది.

Video Advertisement

అయితే బ్రేక్ అప్ లు సాధారణం అయిపోయిన ఈ రోజులో మనం వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అన్నదే మేటర్. అయితే తాజాగా ఒక బ్రేకప్ లెటర్ నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతోంది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో బ్రేకప్ లెటర్ చర్చనీయాంశంగా మారింది. ఒక యువకుడు తాను ప్రేమించిన యువతికి ఫార్మల్ స్టైల్ లో బ్రేక్ అప్ లెటర్ పంపించి.. సైన్ చెయ్యమన్నాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను అతడు సోషల్ మీడియా లో పంచుకోవడం తో నెటిజన్లు రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు.

guy shares breakup letter on social media..

వెలిన్ అనే యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తన తో విడిపోవాలని కోరుకుకోవడం తో ఆమె తరపున ఒక లెటర్ రాసి.. దాని పిడిఎఫ్ ని ఆమెకు పంపి.. సైన్ చేసి తిరిగి పంపమని పేర్కొన్నాడు. ఆ లెటర్ ని ఆమె తో చేసిన చాటింగ్ ని స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియా లో పంచుకున్నాడు. ఆమె తరపున అతడు ఆ లెటర్ రాసాడు.. అందులో ” డియర్ వెలిన్, నువ్వు ఆరోగ్యం గా ఉన్నవని కోరుకుంటున్నాను. అయితే ఈ మధ్య కాలం లో నన్ను కొన్ని విషయాలు ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే నీతో రిలేషన్ కి ఇక ముగిద్దాం అనుకుంటున్నాను. ఈ విషయం వల్ల నువ్వు బాధ పడొద్దు. నువ్వు న నిర్ణయాన్ని గౌరవిస్తావని అనుకుంటున్నాను.” అని ఉంది.

guy shares breakup letter on social media..

ఈ లెటర్ ని స్వయం గా తానే తయారు చేసిన వెలిన్ తన గర్ల్ ఫ్రెండ్ ని సైన్ చేసి తిరిగి అతడికి పంపమన్నారు. వీటిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసాడు వెలిన్. దానికి ఇక ఇది అధికారికం అని కాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్ కి 6 లక్షల వ్యూస్, 6 ,820 లైక్స్ వచ్చాయి. దీనిపై పలు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదేందయ్యా .. ఇలాంటి బ్రేకప్ నేను ఎప్పుడు చూడలా అని కామెంట్స్ చేస్తున్నారు. బ్రేకప్స్ ఇక ఇలాగే చేస్తే మంచిదేమో అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.