Ads
మహా పతివ్రత అయిన మండోదరి రావణాసురుడి భార్య. ఈమె విశ్వకర్మ పుత్రుడైన మయ బ్రహ్మ కుమార్తె. ఈమెను రావణాసురుడు మోహించి వివాహం చేసుకోవడం జరిగింది. ఈమెకి ఇంద్రజిత్తు జన్మించాడు.
Video Advertisement
దేవకన్య అయిన హేమకు, మయ బ్రహ్మకు ఈమె కలిగింది. అయితే మండోదరి తన తండ్రితో కలిసి వనంలో వెళ్తున్నప్పుడు రావణుడు వెళ్తూ ఇమ్మని చూస్తాడు. రావణుడికి వివాహం అవ్వలేదు.
అందుకనే తనకు మండోదరిని ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. దీనితో తండ్రి మయుడు మండోదరిని రావణుడుకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈమె ఎంతో సౌందర్యము కలది. శ్రీమద్రామాయణం లో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు మానవత్వాన్ని చూపిస్తాయి.
ఏ స్త్రీకి అయిన తట్టుకోలేని శోకం తన భర్త మరణించినప్పుడు వస్తుంది. సీతాదేవిని రావణుడు అపహరించిన అప్పటి నుండి రావణుడికి ఏదో కీడు వస్తుందని మండోదరికి అనిపించింది. తన భర్తకి కూడా తాను చేసేది అధర్మం అని చెప్తూ ఉండేది. అయితే ఆఖరికి రావణాసుడు బలి కాక తప్పలేదు. యుద్ధభూమికి మండోదరి వస్తుంది. అక్కడ రావణుడి శరీరానికి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద రామలక్ష్మణులు పక్కన విభీషణుడు నిలబడి ఉంటారు.
ఎవరికైనా సరే తన భర్తను చంపారు అంటే ఎంతో కోపం వస్తుంది. అయితే మండోదరికి మాత్రం చంపినా వాళ్లపై కోపం రాలేదు. పైగా ఆమె ఎవరు నిన్ను చంపారు అంటూ మండిపడలేదు. యుద్ధ భూమికి వెళ్లిన మండోదరి పల్లకి దిగి రావణుడు దగ్గరికి ఏడుస్తూ వీళ్ళందరికీ తెలియని విషయం ఒకటుంది. అది ఏమిటంటే రావణుడిని రాముడు చంపారని అందరూ అనుకుంటున్నారు.
నీవు తపస్సు చేసుకునే సమయం లో నీ ఇంద్రియాలను అన్నిటిని అదుపులో ఉంచుకున్నావు. కోరికలను జయించావు. కానీ, సీతమ్మను చూసాక నీ ఇంద్రియాలు అదుపుతప్పాయి. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనబడిందో..? ఆ సమయంలో నీవు నీ ఇంద్రియాలను, కోరికలను తొక్కి పట్టి ఉంచకపోవడం వల్లే నేడు నీకు ఈ పరిస్థితి దాపురించింది. నిన్ను చంపింది రాముడు కాదు.. నీ ఇంద్రియాలే నిన్ను కాటేశాయి..” అంటూ వాపోయింది.
ఏ స్త్రీ అయినా భర్త హత్య చేయబడితే.. ఇటువంటి మాటలు మాట్లాడలేదు. కట్టుకున్న భర్త మరణించినా కూడా మండోదరి ధర్మమే మాట్లాడింది.. అందుకే రామాయణం జరిగిపోయి ఇన్ని కాలాలు గడుస్తున్నా ఆమెను ఎప్పటికి గుర్తు పెట్టుకోవాల్సిందే.
End of Article