మంగళవారం నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

మంగళవారం నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

by Sunku Sravan

Ads

పూర్వం మనకు పెద్దలు కొన్ని ఆచారాలు నియమాలు పెట్టారు, శాస్త్రం ప్రకారం వాళ్ళు తెలుసుకున్నవి అనుభవపూర్వకంగా వారు అనుభవించినవి కొన్ని అయితే, మరి కొన్ని వారు పాటిస్తూ వస్తున్నవి కొన్ని. నేటి ప్రపంచం లో మనకు చెప్పే వారు చాలా తక్కువ. మన కోసం పాటించవలసిన పద్ధతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మంగళవారం నాడు చేయవల్సిన పనులు చెయ్యకూడని పనులు ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

మంగళవారం నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు

మంగళవారం నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు

మంగళవారం నాడు చేయకూడని పనులు :

 1. కుజుడు ని నష్టాలకి కారకుడిగా అంటారు, కావున ససేమిరా మనం ఎలాంటి శుభకార్యాలు మంగళవారం నాడు తలపెట్టకూడదు.
 2. మంగళవారం నాడు మనం అప్పులు ఇస్తే అవి తిరిగి వచ్చే సూచనలు చాలా తక్కువట కాబట్టి అస్సలు ఆ పని చెయ్యొద్దు.
 3. మంగళవారం నాడు గోళ్లు కత్తిరించే ప్రయత్నం అస్సలు చేయొద్దు, ఆలాగే క్షవరం కూడా చేసుకోకూడదు.
 4. కొత్త బట్టలు అస్సలు వేసుకోకూడదు.
 5. మంగళవారం రోజు అప్పు తీసుకుంటే అవి అనవసరంగా ఖర్చు అయ్యి, చివరికి తీరకపోయే ప్రమాదం కూడా ఉంది.
 6. మంగళవారం నాడు తలస్నానం చెయ్యకపోవడం మంచిది.
 7. మంగళవారం నాడు ప్రయాణాలకు దూరం ఉండటమే ఉత్తమం. ఒక వేళ అలా చేయవలసి వస్తే దేవుణ్ణి ధ్యానించి ప్రయాణాలు కొనసాగించటం మంచిది.
మంగళవారం నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు

మంగళవారం నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు

మంగళవారం నాడు చేయవలసిన పనులు

 1. మంగళవారం నాడు హనుమంతుణ్ణి ధ్యానించడం, పూజించడం వలన శుభం జరుగుతుంది.
 2. మంగళవారం నాడు కాళికా దేవిని పూజించడం వలన శత్రుబాధలు నుంచి విముక్తి కలిగే సూచనలు ఉన్నాయి.
 3. మంగళవారం నాడు చేసిన అప్పు తీరిస్తే ఆ అప్పు త్వరగా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి.
 4. మంగళవారం రాహుకాలం లో దుర్గ దేవిని దర్శించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.

Also Read :
బల్లి శాస్త్రం : బల్లి మనుషుల శరీరంపై పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.


End of Article

You may also like