పలాస 1978 ఫేమ్ తిరు వీర్ హీరోగా వచ్చిన చిత్రం మసూద. డెబ్యూ డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ పై బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. కావ్య కళ్యాణ్ రామ్, సంగీత కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సినిమాల్లో మసూద ఒకటి.

Video Advertisement

 

అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ ఏడాది నవంబరు 18న రిలీజైన ఈ సినిమా ని ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ భారీ ధరకి కొనుగోలు చేసిందని సమాచారం. డిసెంబరు 16 లేదా 23న స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే మసూద ఓటిటి రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

masooda movie ott release date is out..!!

థియేటర్స్ లో సినిమా చూడని చాలా మంది.. మసూద మూవీని ఓటిటిలో చూసేందుకు ఎంతో ఎక్సయిట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ని ఓటిటిలో మంచి ఎక్సపీరియన్స్ ఇస్తుందంటున్నారు. హారర్ ఫిల్మ్ లు ఓటిటిలో బాగా వర్కవుట్ అవుతున్నాయి. ఈ నేపథ్యం లో ఈ సినిమా కేవలం హారర్ గానే కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. స్టోరీ, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ వీక్షకుల మైండ్ బ్లాక్ చేస్తూ సాగుతుంది.

masooda movie ott release date is out..!!

అల్లు అర్జున్ గంగోత్రి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. మసూద మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించాడు. గతంలో ఇదే బ్యానర్‌పై మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాలు వచ్చాయి. మసూద చిత్ర విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో వచ్చిన రెగ్యులర్ హార్రర్ చిత్రాల్లో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కొత్ద దర్శకుడు సాయి కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు.