ఈ ఒక్క విషయం తెలిస్తే ఏ భర్తా తన భార్యని బాధ పెట్టడు అనుకుంట..?

ఈ ఒక్క విషయం తెలిస్తే ఏ భర్తా తన భార్యని బాధ పెట్టడు అనుకుంట..?

by Anudeep

Ads

పెళ్లితో ఎవరికైనా కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. అమ్మాయిల జీవితంలో భర్తగా.. అలాగే అబ్బాయిల జీవితంలోకి భార్యగా కొత్త వ్యక్తి వస్తుంటారు. మిగతా అన్ని బంధాలు ఎలా ఉన్నా.. భార్యా భర్తల బంధం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే వారిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి.

Video Advertisement

ఎన్ని అభిప్రాయం భేదాలు, ఆటుపోట్లు వచ్చినా వారిద్దరూ సర్దుకుపోతూ కలిసి మెలసి ఉండాలి. అయితే.. చాలా వైవాహిక సంబంధాలలో భర్త భార్యపై అతిగా అధికారం చూపిస్తూ ఉంటారు.

తన అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా.. భర్త తనకి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ ఉంటాడు. దీనివల్ల ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ సతమతమయ్యే భార్యలు పెద్దలకు భయపడో.. సమాజానికి భయపడో సర్దుకుపోతుంటారు. అయితే.. ఇటువంటి బంధాలలో ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు. అవసరం కోసమే కలిసుండడం తప్ప భార్యా భర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా జరగకూడదు అంటే.. వివాహం జరిపించే సమయంలో పండితులు వరుడి చేత చెప్పించే “నాతి చరామి” అనే మంత్రానికి అర్ధం తెలుసుకోవాలి. “ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్వయైషా నాతిచరితవ్యాః” అని పెళ్లి కూతురు తండ్రి వరుడి చేత చెప్పిస్తారు.

అంటే.. నేటి వరకూ నా కూతురుగా ఉన్న అమ్మాయి.. నేటి నుంచి నీ భార్య అవుతున్నది. అనగా.. నేటి నుంచి ధర్మ కార్యాలను పాటించడంలోనూ, డబ్బు సంపాదనలోను, ఖర్చు పెట్టె విషయాల్లోనూ, కోరిక తీర్చుకునే విషయాల్లో కూడా కూతురి అభిప్రాయాలను అతిక్రమించక.. తనకి కూడా గౌరవం ఇస్తూ నడుచుకుంటానని “నాతి చరామి” అని చెబుతూ ప్రమాణం చేస్తాడు. న+అతిచరామి అనగా.. అతిగా చరించను అని చెబుతూ వరుడి చేత ప్రమాణం చేయిస్తారు. భారతీయ హిందూ వైవాహిక సంప్రదాయంలో ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తెలుసుకుని ఆచరిస్తే.. వారి జీవితం సుఖ ప్రదంగా ఉంటుంది.


End of Article

You may also like