ఈ మొక్కలు అందరికి తెలిసే ఉంటాయి. రోడ్డు పై ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి. కానీ దీని వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్న సంగతి చాలా మందికి తెలియవు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ మొక్కని గడ్డి చామంతి అని పిలుస్తారు. చామంతి జాతికి చెందిన మొక్కే ఇది కూడా. ఇప్పటి జెనరేషన్ వీటి గురించి అంతగా పట్టించుకోకపోవచ్చు.

gaddi chamanthi

కానీ.. నిన్నటితరం పిల్లలకి వీటి గురించి బాగానే తెలుసు. పసుపు పచ్చని పూలతో అందం గా కనిపించే ఈ మొక్కకు ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయట. ఆయుర్వేద మందుల్లో కూడా దీనిని వినియోగిస్తారట. వాత, పిత్త, కఫ సంబంధిత ఇబ్బందుల వలనే మనిషి రోగాల బారిన పడతాడు. వీటికి ఆయుర్వేదం లో చికిత్స ఉంది. ఈ చికిత్స కు అవసరమయ్యే ఔషధాలలో ఉపయోగిస్తారట. ఈ ఆకుల్ని రసంలా పిండి చర్మం పై గాయాలు తగిలిన చోట అప్లై చేస్తే త్వరగా తగ్గుతాయట. ఎగ్జిమా నివారణకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయట. పొట్టలో పుండ్లు రావడం, హెపాటో ప్రొటెక్షన్, గుండెల్లో మంట వంటి ఇబ్బందులకు వాడే ఆయుర్వేద మందుల్లో ఈ మొక్క ఆకుల్ని ఉపయోగిస్తారట.