ఐపీఎల్  2021 ఆపేస్తున్నట్టు ఇవాళ ప్రకటించారు. ఈసారి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఐపీఎల్ మొదలుపెట్టారు. గత సంవత్సరం ఐపీఎల్ రావడం లేట్ అయింది. కానీ ఈసారి మాత్రం ఎప్పుడు వచ్చేలాగా నే టైం కి ఐపీఎల్ 2021 మొదలయ్యింది. మే 3వ తేదీన జరగవలసిన మ్యాచ్ వరుణ్ చక్రవర్తికి, సందీప్ వారియర్ కి కోవిడ్ పాజిటివ్ రావడంతో క్యాన్సిల్ అయింది. దాంతో మే 3వ తేదీ రోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కోసం ఎదురు చూసిన అభిమానులకు కొంత నిరాశ ఎదురయ్యింది.

ఆ తర్వాత మే 4వ తేదీ పొద్దున వరకు కూడా ఐపీఎల్ ముంబైలో నిర్వహించే అవకాశం ఉంది అని, అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అనే వార్తలు వినిపించాయి. ఈ విషయం పై అధికారిక ప్రకటన కోసం  ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఈ విషయం పై అధికారిక ప్రకటన రావడం పక్కన పెడితే అసలు ఐపీఎల్ క్యాన్సిల్ అయిపోయినట్టు వార్త వచ్చింది. దాంతో ఒక్కసారిగా అందరికీ షాక్ కి గురయ్యారు.

బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడానికి పెరుగుతున్న కరోనా కేసులే కారణం. అసలు ఇలా ఐపీఎల్ మొదలయ్యి కొన్ని మ్యాచ్ లు ఆడిన తర్వాత అర్ధాంతరంగా ఆగిపోవడం అనేది ఇదే మొదటిసారి.  ప్రస్తుతం దేశం మొత్తం ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే టాపిక్ వైరల్ అవుతోంది. ఇలా ఐపీఎల్ సడన్ గా క్యాన్సిల్ అయిపోవడం పై సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15