“ఇక ప్రెడిక్షన్ టేబుల్స్ వేసుకోవాల్సిందే” అంటూ… CSK తో SRH మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

“ఇక ప్రెడిక్షన్ టేబుల్స్ వేసుకోవాల్సిందే” అంటూ… CSK తో SRH మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

by Mohana Priya

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సూపర్ కింగ్స్ జట్టుకి, సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు కి మధ్య జరిగిన మ్యాచ్ లో, 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో అంతకుముందు టాస్ గెలిచిన సన్‌ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (57: 55 బంతుల్లో 3×4, 2×6) బ్యాటింగ్ ఎంచుకున్నారు. డేవిడ్ వార్నర్ తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (7: 5 బంతుల్లో 1×4) ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నారు. అయితే తర్వాత వచ్చిన మనీశ్ పాండే (61: 46 బంతుల్లో 5×4, 1×6) తో కలిసి డేవిడ్ వార్నర్ రెండో వికెట్‌ కి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Video Advertisement

csk winning over srh

ఇన్నింగ్స్ 18 వ ఓవర్‌లో గేర్ మార్చబోయి లుంగి ఎంగిడి బౌలింగ్‌ లో డేవిడ్ వార్నర్ అవుట్ అవ్వగా, అదే ఓవర్‌ లో మనీశ్ పాండే కూడా అవుట్ అయ్యారు. ఇన్నింగ్స్ 19 వ ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ (26 నాటౌట్: 10 బంతుల్లో 4×4, 1×6) చేయగా చివరి ఓవర్‌ వేసిన శామ్ కరన్ బౌలింగ్‌ లో ఆఖరి రెండు బాల్స్ కి కేదార్ జాదవ్ (12 నాటౌట్: 4 బంతుల్లో 1×4, 1×6) చేశారు. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు 3 వికెట్ల నష్టానికి 171 పరుగుల స్కోర్ చేసింది.

172 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (75: 44 బంతుల్లో 12×4), డుప్లెసిస్ (56: 38 బంతుల్లో 6×4, 1×6) మొదటినుంచి దూసుకెళ్లారు. వీరిద్దరూ కలిసి కలిసి 13 ఓవర్లలోనే 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ తర్వాత టాప్‌ గేర్‌ లోకి వెళ్లిపోయిన రుతురాజ్‌ తో పాటు డుప్లెసిస్, మొయిన్ అలీ (15: 8 బంతుల్లో 3×4)లను వరుస ఓవర్లలో స్పిన్నర్ రషీద్ ఖాన్ అవుట్ చేశారు. చివరిలో రవీంద్ర జడేజా (7 నాటౌట్: 6 బంతుల్లో 1×4), సురేశ్ రైనా (17 నాటౌట్: 15 బంతుల్లో 3×4) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18.3 ఓవర్లలో 173/3 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని ఈ మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14

#15


You may also like