“ట్రోల్ చేస్తే ఎలా ఊరుకుంటాం అనుకున్నార్రా.?” అంటూ… IND Vs ENG 4వ టెస్ట్ లో ఇంగ్లాండ్ పై ఇండియా గెలవడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“ట్రోల్ చేస్తే ఎలా ఊరుకుంటాం అనుకున్నార్రా.?” అంటూ… IND Vs ENG 4వ టెస్ట్ లో ఇంగ్లాండ్ పై ఇండియా గెలవడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

ఇంగ్లండ్ వేదికగా సోమవారం జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో 157 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. 1971లో విజయాన్ని అందుకున్న టీమిండియా మళ్ళీ చాలా సంవత్సరాల విజయాన్ని నమోదు చేసుకుంది. భారత జట్టు ఇంగ్లాండ్ పై సిరీస్ లో ఒకటి కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ గెలవడం గత 35 సంవత్సరాలలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చివరిగా 1986 లో భారత జట్టు ఇంగ్లాండ్ పై రెండు టెస్ట్ మ్యాచ్ లు గెలుపొందింది.ind vs eng 4th test memes

Video Advertisement

ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రం టెస్ట్ సిరీస్ చేజిక్కించుకుంది. గురువారం మొదలైన ఈ టెస్ట్ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (50: 96 బంతుల్లో 8×4) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, చివరిలో శార్ధూల్ ఠాకూర్ (57: 36 బంతుల్లో 7×4, 3×6) హిట్టింగ్‌ తో టీమిండియా పరువు కాపాడారు. తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు ఓలీ పోప్ (81: 159 బంతుల్లో 6×4), క్రిస్‌వోక్స్ (50: 60 బంతుల్లో 11×4) హాఫ్ సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 290 పరుగులు చేసింది.

 

99 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియాలో రోహిత్ శర్మ (127: 256 బంతుల్లో 14×4, 1×6) సెంచరీ నమోదు చేయగా, పుజారా (61: 127 బంతుల్లో 9×4), రిషబ్ పంత్ (50: 106 బంతుల్లో 4×4), శార్ధూల్ ఠాకూర్ (60: 72 బంతుల్లో 7×4, 1×6) స్కోర్ చేశారు. 368 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్ (50: 125 బంతుల్లో 5×4), హసీబ్ హమీద్ (63: 193 బంతుల్లో 6×4) చేయగా, తర్వాత వచ్చిన జో రూట్ (36), డేవిడ్ మలాన్ (5), ఓలీ పోప్ (2), జానీ బెయిర్‌స్టో (0), మొయిన్ అలీ (0) చేశారు. భారత జట్టు బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు, జడేజా రెండు వికెట్లు, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4

#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21


You may also like