“భువి బ్యాక్ టు ఫామ్.!” అంటూ…మొదటి T20 లో శ్రీలంకపై ఇండియా గెలవడం పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“భువి బ్యాక్ టు ఫామ్.!” అంటూ…మొదటి T20 లో శ్రీలంకపై ఇండియా గెలవడం పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

శ్రీలంక వేదికగా సారీ కొలంబో వేదికగా ఆదివారం అర్థరాత్రి జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌ లో 38 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (16: 14 బంతుల్లో 1×6) ఫీల్డింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన టీం ఇండియా లో పృథ్వీ షా (0) మొదటి బంతికే వికెట్ చేర్చుకున్నారు తర్వాత మూడవ నెంబర్ లో వచ్చిన సంజు శాంసన్ (27: 20 బంతుల్లో 2×4, 1×6) దూకుడుగా ఆడగా మరో ఎండ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ (46: 36 బంతుల్లో 4×4, 1×6) మెల్లగా మొదలు పెట్టారు.

Video Advertisement

ఇన్నింగ్స్ లో 11వ ఓవర్ నుంచి శిఖర్ ధావన్ గేర్ మార్చగా సూర్యకుమార్ యాదవ్ (50: 34 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీ చేసి భారీ షాట్లు కొట్టారు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (10: 12 బంతుల్లో) చేయగా చివరిలో వచ్చిన ఇషాన్ కిషన్ (20 నాటౌట్: 14 బంతుల్లో 1×4, 1×6) టీమిండియా కి విలువైన పరుగులు అందించారు. 165 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఓపెనర్లు మినోద్ భానుక (10: 7 బంతుల్లో 2×4), అవిష్కా ఫెర్నాండో (26: 23 బంతుల్లో 3×4) తక్కువ స్కోర్ కి వికెట్లు చేజార్చుకోగా మూడవ స్థానంలో వచ్చిన వచ్చిన ధనంజయ డిసిల్వా (9: 10 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు.

తర్వాత చరిత అసలంక (44: 26 బంతుల్లో 3×4, 3×6) చేయగా అప్పటికే అసేన్ బంద్రా (9: 19 బంతుల్లో) చేశారు. చివరిలో కరుణరత్నె (3), ఇసుర ఉదాన (1)తో పాటు చమీరా (1)లను లో అవుట్ చేసి భువనేశ్వర్ కుమార్ 18.3 ఓవర్లలోనే శ్రీలంక ఇన్నింగ్స్‌ ముగించారు. స్పిన్నర్లు కృనాల్ పాండ్య ఒక వికెట్, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్, చాహల్ ఒక వికెట్, వీరితో పాటు హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17


End of Article

You may also like