నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ NBK ప్రోగ్రాం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది సినీ ప్రముఖులతో, అలాగే రాజకీయ ప్రముఖులతో బాలకృష్ణ మాట్లాడి వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని ప్రేక్షకులతో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందులో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు వచ్చారు. గత సీజన్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు వచ్చారు. ఈ సీజన్ లో ప్రభాస్ వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు అనే సంగతి తెలిసిందే.

Video Advertisement

 

ఇప్పటికే బాలకృష్ణ- పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తాలూకు ఫొటోస్, వీడియోస్ షేర్ చేయగా భారీ స్పందన లభించింది. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి, మెగా ఫ్యాన్స్. ఇప్పటికే విడుదలైన వీడియో గ్లింప్స్‌, టీజర్ ద్వారా ఈ ఎపిసోడ్ లో మంచి ఫన్ ఉండబోతుందని అందరికీ అర్థమైంది. పవన్ కళ్యాణ్ సినిమా, పాలిటిక్స్ విషయమై ఎన్నో టాపిక్స్ బయటకొస్తాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఆహా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

memes on pavan kalyan unstoppable promo..

బాలకృష్ణ- పవన్ కళ్యాణ్ హుషారెత్తే మాటలతో సాగిపోనున్న ఈ ఎపిసోడ్ నిడివి గంట కంటే ఎక్కువగా వచ్చిందట. దీంతో దీన్ని రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయాలని ఆహా యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలి ఎపిసోడ్‌ను ఫిబ్ర‌వ‌రి 3 నుంచి స్ట్రీమింగ్ చేయ‌బోతున్నార‌ని సమాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అఫిషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. రెండు ఎపిసోడ్స్ కూడా ఒకదాన్ని మించి మరొకరి ఉండేలా ప్లాన్ చేశారట.

గతంలో ప్రభాస్ ఎపిసోడ్ కూడా ఇలాగే రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎపిసోడ్స్ కూడా ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అదే ప్లాన్ చేసింది ఆహా టీం. అలాగే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని ఈ రోజు విడుదల చేసింది ఆహా టీం. ఈ ప్రోమో కోసం పవన్ అభిమానులే గాక.. ఇతర హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రోమో పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

watch video :