Home Off Beat “శ్రీకృష్ణ దేవరాయలు” తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఇదేనా..? ఇలా ఎందుకు చేసారు..?

“శ్రీకృష్ణ దేవరాయలు” తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఇదేనా..? ఇలా ఎందుకు చేసారు..?

by Sainath Gopi

Ads

సాళువ తిమ్మరుసు గొప్ప చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యానికి మంత్రిగా ఉండేవారు. ఆయనను శ్రీకృష్ణ దేవరాయలు అప్పాజీ అని ముద్దుగా పిలిచేవారు.

Video Advertisement

శ్రీకృష్ణ దేవరాయల సవతి సోదరుడు రాజు తుళువ నర్సింహ రాయల చనిపోయిన తరువాత అప్పాజీ రాయలను  రాజును చేశాడు. అయితే అనారోగ్యంతో ఉన్న రాజు తుళువ నర్సింహ రాయల తన చిన్న కుమారుడిని రాజును చేయాలనే  ఉద్దేశ్యంతో కృష్ణదేవ రాయలను అంధుడిగా  చేయమని తిమ్మరుసుకు చెబుతాడు.
ప్రధాన మంత్రి తిమ్మరుసు రాజు అనంతరం సమర్ధుడైన పాలకుడిగా కృష్ణరాయలను భావించి,  మేక కళ్ళను తెచ్చి రాజుకు కృష్ణరాయల కళ్ళుగా చూపిస్తాడు. వాటిని చూసి సంతృప్తి చెందిన రాజు ప్రశాంతంగా మరణించాడు. ఆ తరువాత తిమ్మరుసు కృష్ణదేవరాయ చక్రవర్తిగా చేశాడు. అప్పాజీ సహకారంతో కృష్ణదేవరాయ గొప్ప చక్రవర్తిగా ఎదిగాడు. విజయనగర సామ్రాజ్యా కీర్తిని నలు దిశలలో చాటుతూ, గొప్ప చక్రవర్తిగా పేరు గాంచాడు.

శ్రీకృష్ణ దేవరాయలకు  తిరుమల దేవి,  చిన్నాదేవి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. ఆ తరువాత యుద్దంలో ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా స్వీకరించాడు. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా పిలిచేవారు. విజయనగరానికి లక్ష్మీదేవితో పాటు ఆమె పినతండ్రి కూడా రావడం జరుగుతుంది. బహుమనీ సుల్తానులు విజయనగరం మీదకు దండేతిన సమయంలో విజయనగర సామ్రాజ్యం గజపతులకు దక్కాలనే కుట్రతో లక్ష్మీ పినతండ్రి ఓ పన్నాగం పన్నుతాడు.
అతను అనుకున్నది జరగాలంటే అంటే మహామంత్రి తిమ్మారుసును రాజ్యానికి దూరం చేయాలని భావిస్తాడు. అతని తెలివితోనే విజయనగర సామ్రాజ్యం గొప్పగా మారిందని గ్రహించి రాయలకు తిమ్మారుసును దూరం చేయాలని అనుకుంటాడు. దానిలో భాగంగా రాయలు యుద్ధానికి వెళ్లేముందు కుమారుడు తిరుమల రాయలకు పట్టాభిషేకం చేయమని కుమార్తె లక్ష్మితో చెప్పిస్తాడు. అప్పాజీని అడిగి నిర్ణయం తీసుకుండామని చెప్పినా వినకుండా పదే పదే అడగడంతో కుమారును పట్టాభిషేకానికి రాయలు ముహూర్తం నిర్ణయిస్తారు.

అయితే తిమ్మరుసు మీద రాజద్రోహం ముద్ర వేయడం కోసం గజపతుల నుండి విషం తెప్పించి,  పట్టాభిషేకానికి ముందు చిన్నపిల్లవాడైన తిరుమల రాయలకు విషయం తాగించి, ఆ పిల్లవాడిని తిమ్మరుసు ఉన్న ప్రదేశంలో వదలగా, బాధతో ఆరుస్తున్న తిరుమల రాయలను ఎత్తుకుని రాయల మందిరంలోకి తిమ్మరుసు తీసుకెళ్తాడు. కానీ ఆ లోపే తిరుమల రాయలు మరణిస్తాడు. అప్పుడు లక్ష్మీ పినతండ్రి తిరుమల రాయలను చంపింది తిమ్మారుసు అని చెప్పడంతో రాయలు కోపంతో అల చెప్పడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. తిమ్మారుసుకి గజపతులు అంటే పగ అనే విషయం మీకు తెలుసు. లక్ష్మీ కుమారుడు రాజు అవడం ఇష్టం లేకపోవడం వల్లే చంపాడని చెప్తాడు. మిమ్మల్ని చంపానని చెప్పి, తరువాత రాజును ఎలా చేశాడో, అలాగే మీ కొడుకుని చంపి మీ  తమ్ముడు అచ్యుత రాయలను రాజును చేయాలనుకున్నాడని అంటాడు. కుమారుడు చనిపోయిన బాధలో ఉన్న రాయలు దానిని నమ్మి తిమ్మారుసును బంధించమని, అది రాజద్రోహంగా భావించి తనను పెంచి పెద్ద చేసిన తిమ్మరుసు రెండు కళలు పొడిచేయమని ఆజ్ఞాపిస్తాడు.
అయితే కొంతకాలానికి గజపతుల వల్లే ఇది జరిగిందని తెలుసుకుని తిమ్మారుసుని క్షమించమని వేడుకుని రాజ్యానికి తీసుకురాగా, ఆయన ఇంకా మంత్రిగా ఉండలేనని తిరుపతికి వెళ్ళి చివరి రోజులు అక్కడే గడిపాడని శాసనాల ద్వారా తెలుపబడింది. రాయలు తప్పు చేశాననే తీవ్ర వేదనతో అనారోగ్యం పాలయ్యారు మరియు కొంతకాలానికి మరణించారు. ఇదే గొప్ప చక్రవరి అయిన శ్రీకృష్ణ దేవరాయల జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు అని అంటారు.

Also Read: మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి బాబ‌ర్ కి శ్రీకృష్ణదేవరాయలంటే అంత భయమెందుకు..? విజయనగరంపై అందుకే కన్నేయలేదు.!

 


End of Article

You may also like