స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. సీరియల్స్ లో సూపర్ హిట్ అది. దాని రికార్డులు ఇప్పటి వరకు వేరే ఏ సీరియల్ కి లేవు. క్రికెట్ మ్యాచ్ ల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని ఈ సీరియల్ ముందు తేలిపోయాయి. ఈ సీరియల్స్ లో నటులకి ఉన్నంత క్రేజ్ సినిమా హీరోలకి కూడా లేదు. ఈ సీరియల్ లో వంటలక్క అయిన ప్రేమీ విశ్వనాధ్, డాక్టర్ బాబు అయిన నిరుపమ్, సౌందర్య అయిన అర్చన అనంత్ ఎంతో పేరు సంపాదించుకున్నారు.

Video Advertisement

అలాగే ఈ సీరియల్ లో నెగటివ్ పాత్రలో నటించిన మోనిత కి కూడా ఫాన్స్ ఎక్కువ మందే ఉన్నారు. అయితే కార్తీక దీపం సీరియల్ లో తన పాత్ర ముగిసిందంటూ ఇటీవల శోభా శెట్టి తన యూట్యూబ్ వీడియో లో పంచుకున్నారు. ” నా లైఫ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించాను. ఇంత ఫేమ్ ఎప్పుడు రాలేదు. ఇంతలా ఎప్పుడూ బాధపడలేదు. కార్తీక దీపం నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అయ్యి కూర్చున్నాను. కానీ నా పాత్రను తొలగించినట్టు చెప్పారు.” అంటూ ఆ వీడియో లో చెప్పి ఎమోషనల్ అయింది శోభా శెట్టి.

monitha re entry in karthika deepam again..!!

ఆ వీడియో చూసిన అందరూ ఇక మోనిత పాత్ర ఆ సీరియల్ లో ఉండదని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే.. మోనిత ఇప్పుడు మళ్లీ సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘‘ఎన్ని రోజులైంది కార్తీక్ నీ గొంతు విని..? అదీ.. నా పేరు నీ నోట వింటే ప్రాణానికి హాయిగా ఉంది.. జైల్లో ఉన్నానే కానీ నీ గురించే ఆలోచిస్తున్నాను.. ఆ చారుశీల నా మనిషే’ అంటూ మోనిత మళ్లీ సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అందరూ షాక్ అయ్యారు.

monitha re entry in karthika deepam again..!!
దీంతో ఇప్పుడు మోనిత తన ఛానల్ ప్రమోషన్స్ కోసమే ఆ వీడియో పెట్టిందా. .? అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రొడక్షన్ హౌస్ వాళ్లే కాకుండా.. స్టార్ మా ఛానల్ వాళ్లు కూడా.. తనని రావొద్దని చెప్పారని చెప్పి.. తెగ ఏడ్చేసింది. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియో చేసింది వ్యూస్ కోసమే అన్న విమర్శలు మొదలయ్యాయి. ఎందుకు ఇటువంటి వీడియోస్ చేస్తూ పరువు తీసుకుంటున్నారు అని శోభాశెట్టి ఫాన్స్ ఫీల్ అవుతున్నారు.