తల్లి ఆస్తి కూతురికి చెందుతుందా..? కొడుకుకి చెందుతుందా..? చట్టం ఏం చెప్తోంది..?

తల్లి ఆస్తి కూతురికి చెందుతుందా..? కొడుకుకి చెందుతుందా..? చట్టం ఏం చెప్తోంది..?

by Harika

Ads

సాధారణంగా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిలో వారి పిల్లలు హక్కును కలిగి ఉంటారు. కుటుంబ యజమాని తన కుటుంబంలోని పిల్లలందరికి ఆస్తిని సమానంగా పంచుతూ వీలునామ కూడా రాస్తారు. వీలునామా రాయడానికి కారణం తమ తదనంతరం వారి పిల్లల మధ్య ఎలాంటి ఆస్తితగాదాలు ఉండకూడదని ఇలా చేస్తారు. ఈ విషయంపై ఇప్పటికి కూడా ఎన్నో రకమైన చర్చలు జరుగుతూనే ఉంటాయి.

Video Advertisement

ఆస్తికి యజమాని తల్లి అయితే, ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఎవరికి చెందుతుంది. చట్టం దాని గురించి ఏం చెబుతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Mother-Property-2తల్లి ఆస్తికి పూర్తిగా యజమాని అయితే, ఆమె ఎలాంటి వీలునామా రాయకుండా మరణించినపుడు ఆ ఆస్తి ఆమె  కొడుకు మరియు కుమార్తెలకు సమానంగా చెందుతుంది. కుమారులు మరియు కూతుర్లకు సమాన హక్కులు  ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి మీద సమాన హక్కు ఉంటుంది.హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి పై కుటుంబంలోని కూతుర్లకు సమాన హక్కులను కల్పించింది. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబం(HUF )లో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు మరియు బాధ్యతలు కలిగి ఉంటుంది. 2005 అనంతరం పూర్వీకుల యొక్క ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు, కుమారుడితో సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందడానికి డిమాండ్ చేసే హక్కు కూతుర్లకు ఉంది.అయితే తల్లి తన ఆస్తి గురించి వీలునామా రాసినపుడు, ఆ వీలునామాలో తన కుమార్తెను చేర్చకపోతే, ఆ ఆస్తిపై  కుమార్తెకు హక్కు ఉండదు. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా, ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామా రాసినట్లయితే అది వారికే చెందుతుంది. దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..

watch video :

Also Read: నాడు బ్రిటిషర్లకే డబ్బులు అప్పు ఇచ్చిన భారతీయుడి కుటుంబం..! ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది..?


End of Article

You may also like