Ads
ఐపీఎల్ 2020 లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి, ముంబై ఇండియన్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడా తో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. జోష్ ఫిలిప్పీ (33: 24 బంతుల్లో 4×4, 1×6), దేవ్ దత్ పడిక్కల్ (74: 45 బంతుల్లో 12×4, 1×6) కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (9: 14 బంతుల్లో) స్కోర్ చేశారు.
Video Advertisement
తర్వాత ఏబీ డివిలియర్స్ (15: 12 బంతుల్లో 1×4, 1×6) చేయగా, శివమ్ దూబే (2), క్రిస్ మోరీస్ (4) చేశారు. చివరిలో గుర్‌కీరత్ సింగ్ (14 నాటౌట్: 11 బంతుల్లో 2×4), వాషింగ్టన్ సుందర్ (10 నాటౌట్: 6 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3/14 చేయగా, కీరన్ పొలార్డ్ ఒక వికెట్, ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్, రాహుల్ చాహర్ ఒక వికెట్ పడగొట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోర్ చేసింది.
ముంబై ఇండియన్స్ జట్టు ఓపెనర్లు డికాక్ (18: 19 బంతుల్లో 1×6), ఇషాన్ కిషన్ (25: 19 బంతుల్లో 3×4, 1×6) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన సౌరబ్ తివారి (5) కృనాల్ పాండ్య (10) స్కోర్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ (79 నాటౌట్: 43 బంతుల్లో 10×4, 3×6) చేయగా, చివరిలో హార్దిక్ పాండ్య (17: 15 బంతుల్లో 2×6) , తర్వాత కెప్టెన్ కీరన్ పొలార్డ్ (4 నాటౌట్: 1 బంతి 1×4) స్కోర్ చేశారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు, మోరీస్ ఒక వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జట్టు 166/5 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20
End of Article