Ads
ఉద్యోగం రావాలంటే మొదట ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి. ఎక్కువ మార్కులు వచ్చినా వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో ఫీలవుతూ ఉంటారు. అయితే ఇంటర్వ్యూలో వచ్చే మార్పులను బట్టి ఉద్యోగం వస్తుందా రాదా అనేది ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోండి.
Video Advertisement
ప్యానెల్ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. అయితే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఉద్యోగాన్ని పొందలేక పోవచ్చు. ఈ పొరపాట్లు మీ ఇంటర్వ్యూలో జరగకుండా చూసుకుంటే అప్పుడు ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. అయితే మరి ఎలాంటి తప్పులు చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
#1. అతివిశ్వాసం:
ఆత్మవిశ్వాసం ఉంటే అది ఎప్పుడు ప్లస్ అవుతుంది. కానీ అతి విశ్వాసం ఉంటే ఇబ్బంది వస్తుంది. ప్యానెల్ సభ్యులకి ఆత్మవిశ్వాసం కనపడాలి. మనం చెప్పే ప్రతి మాటలోనూ కూడా ఇది వాళ్లకి కనబడుతూ ఉండాలి. ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తప్పక గమనిస్తారు. ఒకవేళ కనుక మీరు మరీ గంభీరంగా చెప్పినా లేదంటే గట్టిగా మాట్లాడిన వాళ్లు ఆలోచిస్తారు. కాబట్టి మీ ప్రవర్తన పై దృష్టి పెట్టండి.
#2. బోర్ ఫీల్ అయిన కనపడనివ్వద్దు:
ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంటర్వ్యూలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇలా జరిగినప్పుడు చాలా మందికి బోర్ కొడుతుంది. మీలు కూడా అలా అనిపించినా దానిని కనపడనివ్వద్దు. మీ సహనం ఎంతవరకు ఉంది అనేది కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి అస్సలు బోర్ అనేది కనపడనివ్వద్దు.
#3. మీరు ఉత్సాహంగా ఉండండి:
మీరు జవాబులు చెప్పినప్పుడు కూడా ఉత్సాహం కనపడాలి. మాటల్లో నీరసంగా వున్నా ఉత్సాహం లేకపోయినా చెడు ఇంప్రెషన్ వస్తుంది.
#4. అసౌకర్యంగా ఉండద్దు:
కొన్ని కొన్ని సార్లు జవాబులు తెలియకపోయినా లేదంటే అంత క్లారిటీగా మీకు లేకపోయినా అసలు మీరు అసౌకర్యంగా ఫీల్ అవ్వద్దు. అసౌకర్యంగా ఉంటే అవసరమైన నైపుణ్యం లేదేమో అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దీనితో ఇంటర్వ్యూలో మీరు విఫలమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా మీరు అసౌకర్యంగా ఫీల్ అయితే ”నేను అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. నా పరిస్థితి మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను” అని వాళ్ళకి చెప్పండి. దీంతో మీరు కాన్ఫిడెంట్ గా వున్నారు అని వాళ్ళకి అర్థమవుతుంది.
End of Article