ఎల్లప్పుడూ నీరసంగానే అలిసిపోయినట్టు ఉంటుందా.? అయితే మీ ఆహారంలో ఇవి చేర్చండి.!

ఎల్లప్పుడూ నీరసంగానే అలిసిపోయినట్టు ఉంటుందా.? అయితే మీ ఆహారంలో ఇవి చేర్చండి.!

by Anudeep

Ads

కరోనా వచ్చి వెళ్ళాక మానవ ఆరోగ్య వ్యవస్థల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. దానికి తోడు కంప్యూటర్ ఉద్యోగాలు తెచ్చిన తిప్పలు అన్ని ఇన్ని కావు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, కంప్యూటర్ తో పనులు మొదలయ్యాకా.. మనిషి జీవితం లో చాలా మార్పులు వచ్చాయి. గంటల తరబడి కంప్యూటర్ ల ముందే కూర్చోవాల్సి రావడం తో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తీసుకునే ఆహరం లో చోటు చేసుకున్న మార్పులు, సమయ పాలన లేకపోవడం వలన కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలయ్యాక ఈ ఇబ్బందులు మరిన్ని పెరిగాయి.

Video Advertisement

వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక పని వేళలు మరింత పెరిగాయి. అంతే కాదు.. ఆఫీస్ వాతావరణం నుంచి.. ఇంటికి వచ్చాక రిలీఫ్ ఫీల్ అయ్యే వారు. ప్రస్తుతం.. ఇల్లే ఆఫీస్ వాతావరణాన్ని తలపిస్తుండడం తో ఆ ప్రశాంతత ఉండడం లేదు. దీనితో కొత్త సమస్యలు వస్తున్నాయి. భోజనం చేసిన తరువాత కూడా నీరసం గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సరైన ఆహరం తీసుకోకపోవడం వల్లనే ఈ ఇబ్బందులన్నీ. మీకు కూడా ఎప్పుడు నీరసించిపోతున్నట్లు అనిపిస్తోందా..? అందుకే.. ఈ ఆహార పదార్ధాలను మీ భోజనం లో చేర్చుకుని సమస్యలను అధిగమించండి. ఏ ఏ ఆహార పదార్ధాలు.. ఏ ఏ అవయవాలకు మేలు చేస్తాయో ఓ లుక్ వేయండి.

కళ్ళు:

healthy food 1
కంప్యూటర్ ల పై పని చేస్తున్న వారికి చూపు సంబంధించి సమస్యలు వస్తూనే ఉన్నాయి. అందుకే ఆకుకూరలు, గుడ్లు, చేపలు వంటి పదార్ధాలను తప్పని సరిగా తీసుకోవాలి. వీటిల్లో, ఏ, సి, ఈ-విటమిన్లు పుష్కలం గా లభిస్తాయి. జింక్, లుటీన్ (కెరటినాయిడ్), ఒమేగా -త్రీ ఫాటీ ఆసిడ్స్ ఎక్కువ లభించే పదార్ధాలు అయిన బెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ వంటి పదార్ధాలను ఎక్కువ గా తీసుకోవాలి.

రోగ నిరోధక వ్యవస్థ:

healthy food 4
ఎటువంటి ఆరోగ్య సమస్యను అయినా ఎదుర్కోవాలంటే మన రోగనిరోధక వ్యవస్థ పటిష్టం గా ఉండాలి. అందుకోసం ఇమ్యూన్ సిస్టం ను పటిష్టం చేసే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. బ్రోకలీ, వెల్లుల్లి, అల్లం, కివి, బొప్పాయి, మిరియాలు, నిమ్మ, నారింజ వంటి పండ్లను తరచుగా తీసుకోవాలి.

జీర్ణ వ్యవస్థ:

healthy food 2
మనం ఆహరం తీసుకోవడం ఎంత అవసరమో.. ఆ ఆహరం జీర్ణం అవ్వడం కూడా అంతే అవసరం. అందుకోసం తిన్న ఆహరం సులువు గా జీర్ణం అయ్యేందుకు దోహదం చేసే పదార్ధాలను తీసుకోవాలి. మసాలా దినుసులు, బీన్స్, మాంసం వంటివి కూడా ఆహరం లో భాగం చేసుకోవాలి.

మెదడు:

Dark Chocolate
మెదడు చురుకు గా పనిచేయడం కోసం చాకోలెట్స్, బ్లూ బెర్రీస్, నట్స్ వంటి పదార్ధాలను తీసుకోవాలి. ఆఫీస్ లో పని చేసే అందరు ఎక్కువ గా బ్రెయిన్ ఫంక్షన్స్ పైనే ఆధారపడతారు. అందుకే వారు ఎల్లప్పుడూ తమ మెదడు ను చురుకు గా ఉంచుకోవాలి. ఫైబర్ ఎక్కువ గా ఉండే పదార్ధాలు, దానిమ్మ, బ్రౌన్ రైస్, డార్క్ చాక్లెట్ వంటివి మెదడు చురుకుగా పని చేయడానికి దోహదం చేస్తాయి.

ప్రేగులు:

healthy food 3
ఆహరం సక్రమం గా జీర్ణం అవడం లో ప్రేగులు కీలక పాత్ర పోషిస్తాయి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ లు చేయడం ద్వారా వీటిని ఆరోగ్యం గా ఉంచుకోవచ్చు. ఆకు కూరలు, సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్, ఫైబర్ ఎక్కువ గా ఉండే పదార్ధాలు ప్రేగులను సక్రమం గా పని చేసే విధం గా తోడ్పడతాయి. ఈ పదార్ధాలు ప్రేగు కాన్సర్ ను రాకుండా నివారిస్తాయి. మనం తీసుకునే ఆహారమే మనకు అనారోగ్యం కలగకుండా కాపాడుతుంది.

 


End of Article

You may also like