Ads
సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా ఇది. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ.
Video Advertisement
రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.పాటలతో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సీన్ హైలెట్ అవ్వడానికి ఒక కారణంగా నిలిచింది.
అయితే, సినిమాలో రెండు సీన్ల కారణంగా నెటిజన్స్ డైరెక్టర్ బోయపాటిని తెగ విమర్శిస్తున్నారట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించిన శ్రీకాంత్ పూర్ణ పై ఆమె కొడుకు కళ్ళ ముందే అత్యాచారానికి పాల్పడతాడు. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ సీన్ ను ఆమోదించలేమని చాలా మంది ప్రేక్షకులు చెబుతున్నారు.
ఇక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ పాత్రని పోషించిన సంగతి తెలిసిందే. కానీ.. ఆమెలో ఆ హుందాతనం కనిపించలేదు. ఆమె హీరోతో కల్లు తాగించడం, ఆవకాయని నాకించడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులు నెగటివ్ రెస్పాన్స్ ఇవ్వడానికి కారణం అయ్యాయి. ఏదేమైనా బోయపాటి ఖాతాలో మరో హిట్ జమ అయ్యింది. బోయపాటి-బాలయ్య కాంబో మరో సారి హిట్ కాంబో అనిపించుకుంది. అఖండ 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా లాభాల పంటనే పండించింది. అయితే.. ఈ రెండు సీన్లు లేకపోయుంటే మరింత పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ఉండేదేమో.
End of Article