ఐపీఎల్ లో కొత్త రూల్…ఇకపై బౌలర్స్ కి కొత్త టెన్షన్..!

ఐపీఎల్ లో కొత్త రూల్…ఇకపై బౌలర్స్ కి కొత్త టెన్షన్..!

by Mohana Priya

Ads

మన దేశంలో ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే మిగిలిన షోస్ అన్ని ఒక వైపు, ఐపీఎల్ ఇంకొకవైపు అన్నట్టు ఉంటుంది. చాలా ఇళ్లలో ఐపీఎల్ కోసం బానే డిస్కషన్స్ జరుగుతాయి. అయితే ఈసారి ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకు కారణం కరోనా కేసులు పెరగడమే.

Video Advertisement

New rule in IPL 2021 phase 2

అయితే ఐపీఎల్ సెకండ్ హాఫ్ సెప్టెంబర్ 19వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు జరగబోతోంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఒక కొత్త రకమైన రూల్ ని ప్రతిపాదన లోకి తీసుకొచ్చింది. ఒక ప్లేయర్ బంతిని స్టాండ్స్ లోకి బాదితే, ఆ బంతిని మళ్లీ వాడకూడదు. ఎందుకంటే మైదానం బయట పడే బంతులని ఎవరైనా తాకే అవకాశం ఉంటుంది.

New rule in IPL 2021 phase 2

ఒకవేళ  క్రిములు ఏమైనా అంటుకుంటే అవి వ్యాపించే అవకాశం ఉంటుంది. దీని వల్ల కరోనా సోకే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆ బంతి స్థానంలో కొత్త బంతిని ఉపయోగించాలి అని బీసీసీఐ ప్రతిపాదించింది. ఐపీఎల్ సెకండ్ ఫేస్ మ్యాచ్ కి ప్రేక్షకులని అనుమతిస్తున్నారు. అందుకే ఈ కొత్త నిబంధన తీసుకొచ్చారు. కానీ ఈ ప్రతిపాదన మాత్రం బౌలర్లకు టెన్షన్ గా మారింది.New rule in IPL 2021 phase 2

ఎందుకంటే కొత్త బంతి చాలా గట్టిగా ఉంటూనే సులువుగా బ్యాట్ మీదకి వస్తుంది. అంతే కాకుండా యూఏఈ పిచ్ లు స్పిన్నర్లకి బాగా సహకరిస్తాయి. దాంతో ఈ కొత్త నిబంధన కారణంగా కొత్తగా బాల్ వచ్చిన ప్ర తిసారి బౌలర్లు దానికి అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా బౌలర్లకు పట్టు చిక్కదు. ఈ విషయం బ్యాట్స్మెన్ కి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే ఈ నిబంధన వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అని విశ్లేషకులు అంటున్నారు.


End of Article

You may also like