గత కొంత కాలంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ కంటే వాట్సాప్ వినియోగం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దాదాపు మన దేశంలో కొన్ని కోట్ల మంది వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. ఈ వాట్సప్ వినియోగంలో అధికశాతం మహిళలు కూడా ఉన్నారు.
ఇప్పటికే చాలా కంపెనీలు వాట్సాప్ లో తమ సేవలను లాంచ్ చేస్తున్నాయి. వాట్సాప్ ద్వారా ఎన్నో ఆర్థిక లావాదేవీలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మహిళల కోసం సిరోనా హైజీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కొత్త ఫీచర్ ని వాట్సాప్ లో లాంచ్ చేసింది. ఈ ఫీచర్ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ఫీచర్ కేవలం ఆడవారి కోసమే ఆ సంస్థ ఏర్పాటుచేసింది. ఈ ఫీచర్ ద్వారా మహిళలు నెలసరి సమయం, అండం విడుదలయ్యే సమయం, గర్భం దాల్చడానికి గల ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చును. ఈ ఫీచర్ వాళ్లకు అందుబాటులోకి రావాలి అంటే మొదటగా మహిళలు వాళ్ళ కాంటాక్ట్స్ లోని +919718866644 అనే నెంబర్ ని సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయాలి. తర్వాత ఆ చాట్ అసిస్టెంట్ మీకు అందుబాటులోకి వస్తారు. దానిలో మీకు మూడు ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. అందులో ఒకటి “ట్రాక్ మై పీరియడ్ ” ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ రాబోయే నెలసరి తేదీ ఇది ఖచ్చితంగా చూపిస్తుంది.
రెండో ఆప్షన్ ” ట్రయింగ్ టు కన్సీవ్ ” పెళ్లి అయిన వారు గర్భం దాల్చాలంటే ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. మీ నెలసరి తేదీ బట్టి ఏ సమయానికి మీరు గర్భం దాల్చగలరో చూపిస్తుంది. అండం విడుదల అయ్యే తేదీలను ఈ ఆప్షన్ మీకు సూచిస్తుంది. ఇక మూడో ఆప్షన్ అవాయిడ్ ప్రెగ్నెన్సీ. ఈ ఆప్షన్ ద్వారా మీ నెలసరి కి సంబంధించినవి రిమైండర్ ను మహిళలు సెట్ చేసుకోవచ్చు.