మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నటి నిహారిక కొణిదెల. కొన్ని సినిమాల్లో నటించిన నిహారిక, ఆ తర్వాత నిర్మాతగా మారి, ఎన్నో వెబ్ సిరీస్ నిర్మించారు. ఇప్పుడు నిహారిక కొణిదెల నటించిన వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • వెబ్ సిరీస్ : డెడ్ పిక్సెల్స్
  • నటీనటులు : నిహారికా కొణిదెల, అక్షయ్ లగుసాని, వైవా హర్ష, సాయి రోనక్, భావనా సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ
  • నిర్మాత : సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్రా, రాహుల్ తమడా
  • దర్శకత్వం : ఆదిత్య మందల
  • ఛాయాగ్రహణం : ఫహాద్ అబ్దుల్ మజీద్
  • సంగీతం : సిద్ధార్థ సదాశివుని
  • ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
  • ఎపిసోడ్స్ : 6
  • విడుదల తేదీ: మే 19, 2023

dead pixels web series -story-review-rating

స్టోరీ:

గాయత్రి (నిహారిక కొణిదెల), భార్గవ్ (అక్షయ్ లగుసాని), ఆనంద్ (వైవా హర్ష), రోషన్ (సాయి రోనక్) మంచి స్నేహితులు, వేరే వేరే జాబ్ లు చేస్తూ ఉంటారు కానీ డెడ్ పిక్సల్స్ అనే గేమ్ లో వాళ్ళ జీవితాల కంటే ఎక్కువ అని బతికేస్తుంటారు.

అయితే రోషన్ (సాయి రోనక్) రాకతో గాయత్రి, భార్గవ్ మధ్య ఆటలోనూ, జీవితంలోనూ ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ఫ్లాట్‌మేట్ ఐశ్వర్య (భావనా సాగి) ఎందుకు అనుకుంది? తండ్రితో భార్గవ్ సమస్య ఏమిటి? ఆ గేమ్ వల్ల వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు..? చివరకు ఏమైంది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

dead pixels web series -story-review-rating

రివ్యూ:

ఈ డెడ్ పిక్సల్స్ సిరీస్ స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మొదటి ఎపిసోడ్ లో అన్ని పాత్రల పరిచయం అయ్యాక.. రెండవ ఎపిసోడ్ నుండి, ఈ నలుగురి పర్సనల్ జీవితాలు, వారి ఎలా గేమ్ కి అడిక్ట్ అయ్యి మరి బతుకుతున్నారు అనే అంశాలని కామెడీ గా చూపిస్తూనే, దాని వల్ల కుటుంబం ఎలా బాధపడుతుంది అనే పాయింట్ ని చాలా బాగా అడ్రెస్స్ చేశారు. కచ్చితంగా గేమ్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి ఈ సిరీస్ చూసాక ఒక ఆలోచన అయితే బ్రెయిన్ లో కలుగుతుంది.

dead pixels web series -story-review-rating
అయితే కొన్ని సన్నివేశాలు గానీ, ఆటకు గానీ ఆసక్తిగా అనిపించవు. అయితే… మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ పర్వేలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. కెమెరా వర్క్ నీట్ గా ఉంది.

 

గాయత్రి గా నిహారిక పర్వాలేదన్పించింది. గాయత్రి పాత్రకు ఆ యాక్టింగ్ సెట్ అయ్యింది. అక్షయ్ లగుసాని మెథడ్ యాక్టింగ్ చేశారు. ఆటకు అడిక్ట్ అయిన యువకుడిగా పాత్రలో జీవించారు. ఇక వైవా హర్ష తన కామెడీ ఎప్పట్లాగే నవ్వించాడు, రోషన్ గా సాయి రోనాక్ పర్వాలేదు. ఇక మిగిలిన నటి నటులు తమ పాత్రల మేరకు బాగానే చేసారు.

dead pixels web series -story-review-rating

ప్లస్ పాయింట్స్:

  • సిరీస్ నేపధ్యం
  • కొన్ని ఎపిసోడ్ లు

మైనస్ పాయింట్లు:

  • ఫ్లాట్ నరేషన్
  • స్లో గా సాగే సన్నివేశాలు

dead pixels web series -story-review-rating

రేటింగ్:

2.5 /5

టాగ్ లైన్ :

వీడియో గేమింగ్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అయ్యే సిరీస్..

watch trailer :