Ads
భారతదేశంలో రాఖీ పండుగ ను సోదరీ సోదరులకు అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. సోదరుడి రక్షణకోసం సోదరి రాఖీ కడుతుంది. సోదరి ని కాపాడుతానని సోదరుడు ప్రమాణం చేస్తాడు. అలాంటి రాఖీ పండుగను జరుపుకోని ప్రాంతాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అది కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి.
Video Advertisement
ఉత్తర ప్రదేశ్ గ్రామంలో గోండా జిల్లా లో ఈ పండగను చెడుగా భావిస్తారు. దుమారియాదిహ్ లోని భిఖాంపూర్ జగత్ పూర్వా గ్రామంలో అయితే రాఖీ పండుగను జరుపుకోరు సరికదా అసలు పేరు కూడా పలకరు.
అంతకుముందు రాఖీ పండుగ కి దూరంగా ఉండాలి అని హెచ్చరించే విధంగా ఆ ప్రాంతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. దాంతో రక్షాబంధన్ జరుపుకుంటే వాళ్ళకి చెడు సంభవిస్తుంది అని వాళ్ళు నమ్ముతారు.
అందుకే ఒకవేళ ఆ ప్రాంతంలో రాఖీ పండుగ రోజు ఎవరైనా జన్మిస్తే పండగ జరుపుకుంటే చెడు కలగడం అనేది ఆగిపోతుంది అని వాళ్ళ ఆశ. వజీర్‌గంజ్ పంచాయతీ లోని జగత్ పూర్వాలో 20 ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఉండే దాదాపు 200 మంది పిల్లలు రాఖీ దారం చూసి భయపడుతున్నారు. ముందు తరాల వాళ్ళు కూడా ఇలానే భయపడుతున్నారు.
ఈ గ్రామంలో రాఖీ కట్టి దాదాపు యాభై సంవత్సరాలు అవుతోంది. రక్షాబంధన్ అన్న పేరు వినగానే ఎంతోమంది అక్కలు లేదా చెల్లెళ్ళు భయపడి, రాఖీ కట్టడానికి నిరాకరిస్తారట. వాళ్ల పూర్వీకులు రాఖీ కట్టకుండా ఆచరించిన ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు మార్చడానికి ఎవరు ఇష్టపడటం లేదట .
End of Article