భారత దేశం ఎన్నో వింతలకు విశేషాలకు నెలవు. ఇక్కడ ఎక్కువ గా హిందూ సంప్రదాయం కనిపిస్తుంది. ఇక్కడ దేవి దేవతలకు ఎక్కువ గా శాకాహార నివేదనే చేస్తుంటారు. గ్రామ దేవతలకు బలులు ఇచ్చినప్పటికీ.. ఎక్కువ గా దేవాలయాల్లో శాకాహార నివేదనే ఉంటుంది. అయితే.. ఓ దేవాలయం లో మాత్రం పరమేశ్వరుడి పీతలను నివేదిస్తారట. ఇది ఎక్కడో తెలుసుకుందాం.

lord siva

గుజరాత్ లోని సూరత్ లో సబర్మతి నదీ తీరం లో ఉన్న గల్టేస్వర్ లో పురాతన శివాలయం ఉంది. ఇది చాలా ప్రసిద్ధమైనది. అలాగే.. ఉమ్రా లో ఉన్న రామ్ నాధ్ దేవాలయం లోని పరమేశ్వరుడి పీతలు నివేదిస్తారట. అలా చేస్తే.. చెవులు ఆరోగ్యం గా ఉంటాయని అక్కడివారు విశ్వసిస్తారట. చెవులకు వచ్చే అనారోగ్యాలు నయమవుతాయట. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లి స్వామికి పీతలు నివేదిస్తున్నారట.