వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత ఒకే ఒక జీవితం సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ అండ్‌ టాలెంటెడ్ హీరో శర్వానంద్‌. కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ తెరకెక్కించినఈ మూవీలో రీతూ వర్మ కథానాయికగా నటించగా.. అక్కినేని అమల కీలకపాత్రలో కనిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Video Advertisement

టైం ట్రావెల్‌ నేపథ్యానికి మదర్ సెంటిమెంట్‌ జోడించి శ్రీ కార్తిక్‌ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా శర్వానంద్- అమలల నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇది శర్వాకు 30 వ సినిమా కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది.

oke oka jeevitham ott release update
థియేటర్లో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మీడియాలో ప్రసారం కానుంది. థియేట్రికల్ రన్ పూర్తి అయిన 6 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుందని తెలుస్తుంది. వచ్చేనెల అంటే అక్టోబర్ రెండో వారంలోనే.. ఒకే ఓక జీవితం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు.

oke oka jeevitham ott release update
ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు 15 కోట్లకు సోనీ లీవ్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది.థియేటర్లో అందరిని మెప్పించిన శర్వానంద్ డిజిటల్ మీడియాలో ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.

oke oka jeevitham ott release update
త్వరలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది. సైన్స్‌ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందించారు. ఈ సినిమా టీజర్, అమ్మ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. సెప్టెంబర్ 9న విడుదల అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.50 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది.