Ads
ఆరోగ్యమే మహా భాగ్యం అన్న నానుడి ఎప్పటికీ పాతబడదు. ఎందుకంటే, మనం మన హెల్త్ ను ఎప్పటికీ పరిరక్షించుకుంటూనే ఉండాలి కాబట్టి. అయితే, ఇందుకోసం మనం ఎప్పటికప్పుడు హెల్త్ చెక్ అప్ లు చేయించుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు తెలియకుండానే ఏమైనా హెల్త్ ఇబ్బందులు ఉంటె వెంటనే తెలుస్తుంది. చిన్నతనం లో ఇది ఎలా ఉన్నా, ఒక వయసు కు వచ్చాక మాత్రం కచ్చితం గా హెల్త్ చెక్ అప్ లు చేయించుకోవాలి.
Video Advertisement
అయితే, ఈ హెల్త్ చెక్ అప్ అన్ని సార్లు ఆసుపత్రికి వెళ్లి చేయించుకోవడం కుదరకపోతే.. మీ ఇంట్లోనే వన్ మినిట్ స్పూన్ టెస్ట్ ను ట్రై చేసి చూడండి. దీనిద్వారా చాలా ఇన్ఫెక్షన్స్ ను మనం ముందుగానే గుర్తించవచ్చు. అన్ని రోగాలను ముందుగా పసిగట్టలేకపోయినా కొన్నిటివరకు మనం ముందుగా తెలుసుకోగలుగుతాము. అయితే, ఇందుకు మీరేమి పెద్ద గా కష్టపడాల్సిన పని లేదు. ఇండియా టుడే కధనం ప్రకారం.. శుభ్రంగా ఉన్న ఒక స్పూన్ ను తెచ్చుకుని, దాన్ని మీ నోటిలో పెట్టుకోండి. మీ నోటినుంచి వచ్చే లాలాజలం తో ఆ స్పూన్ ను పూర్తి గా తడిసేవరకు ఉంచండి. ఆ తరువాత దానిని తీసుకుని ఒక పోలిధిన్ కవర్ లో ఉంచి ఎండలో పెట్టండి.
ఒక నిమిషం పూర్తి అయ్యాక, ఆ స్పూన్ ను తీసుకుని నిశితం గా పరిశీలించండి. ఆ స్పూన్ నుంచి ఎలాంటి వాసన వస్తోంది, ఎలాంటి స్ట్రైన్ మార్క్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి మీరు మీ శరీరం లో ఉన్న ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకోవచ్చు. దానిపైన ఎలాంటి దుర్వాసన, స్టెయిన్స్ లేకుండా ఉంటె.. మీరు ఆరోగ్యం గానే ఉన్నట్లు. అలా కాకుండా, విపరీతమైన దుర్వాసన (బాడ్ బ్రీత్ కంటే చెడు దుర్వాసన) వస్తుంటే.. మీకు లంగ్స్ కు సంబంధించిన డిసీజ్ ఉందని అర్ధం. అదే, బాగా స్ట్రాంగ్ అమోనియా లాంటి వాసన వస్తోంటే.. మీకు కిడ్నీస్ కి సంబంధించిన సమస్యలు ఉన్నాయని అర్ధం.
ఇవేవి కాకుండా, ఫ్రూటీ స్మెల్ వస్తే.. మీరు డయాబెటిస్ తో బాధపడుతున్నారని అర్ధం. డయాబెటిస్ తో బాధపడేవారికి శరీరం లో కీటోన్స్ అధిక మొత్తం లో ఉంటాయి. అందుకే స్పూన్ ఫ్రూటీ స్మెల్ వస్తుంది. ఆ స్పూన్ పై వైట్ స్టైన్ ఉంటె రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉందని అర్ధం.. ఎక్కువ మొత్తం లో వైట్ స్టైన్ లాగ కనిపిస్తే.. బాడీ లో చాలా చోట్ల ఇన్ఫెక్షన్స్, వైరస్ లు ఉన్నాయని అర్ధం.
అలాగే, పర్పుల్ స్టైన్ కనిపిస్తే పూర్ బ్లడ్ సర్క్యూలేషన్ ఉందని అర్ధం. బ్రోన్కైటీస్, అధిక మొత్తం కొలెస్టరాల్ లెవెల్స్ ఉన్నవారికి కూడా ఇలానే కనిపిస్తుంది. ఒకవేళ ఎల్లో స్టైన్ కనిపిస్తే, వారికి థైరాయిడ్ గ్లాండ్ లో ఇబ్బందులు ఉన్నాయని అర్ధం. థైరాయిడ్ గ్లాండ్ లో ఇబ్బందులు ఉన్న వారికి థిక్ కోటింగ్ తో కూడిన స్టైన్ కనిపిస్తుంది. ఒకవేళ ఆరంజ్ స్టైన్ కనిపిస్తే, వారు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని అర్ధం చేసుకోవచ్చు. అయితే, వీటిని సూచనలు గా భావించి.. ఏదైనా గుర్తింపు పొందిన ఆసుపత్రి కి వెళ్లి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం..
End of Article