బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? హైదరాబాద్ కు బిర్యానీని పరిచయం చేసింది ఎవరు.?

బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? హైదరాబాద్ కు బిర్యానీని పరిచయం చేసింది ఎవరు.?

by Mohana Priya

Ads

ప్రపంచంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా భారతదేశంలో ఆహారానికి ఉండే రుచి వేరే ఏ దేశంలోని ఆహారానికి రాదు అని అంటారు. అదేవిధంగా బిర్యానీకి కూడా హైదరాబాద్ బిర్యానీ ఉన్నంత రుచిగా వేరే ఏ ప్రదేశానికి చెందిన బిర్యానీ ఉండదు అని అంటారు.  అంటే వేరే ప్రదేశం రుచిని బాలేదు అని అనట్లేదు, కానీ హైదరాబాద్ అంటేనే బిర్యానీకి చాలా ఫేమస్. ఇక్కడ బిర్యానీ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

Video Advertisement

Origin of biryani in India

బిర్యానీ అనే పదం పర్షియన్ పదమైన బిరియన్ నుండి వచ్చింది. బిరియన్ అంటే ఫ్రైడ్ బిఫోర్ కుకింగ్ (Fried Before Cooking) అని అర్థం. అంటే వేయించిన అని అర్థం. బిర్యానీ పర్షియాలో పుట్టింది. మొగలాయిల ద్వారా భారతదేశానికి పరిచయం అయ్యింది. అయితే మొదటి బిర్యానీని ఎవరు తయారు చేశారు అనే దానిపై ఇప్పటికి కూడా సందేహాలు ఉన్నాయి. ఈ విషయంపై రెండు, మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి షాజహాన్ భార్య ముంతాజ్ బేగం కి సంబంధించినది.

Origin of biryani in India

ఈ బిర్యానీని షాజహాన్ భార్య ముంతాజ్ తయారు చేయించారు. ఒకసారి ముంతాజ్ బేగం సైనికులని చూడడానికి వెళ్లారు. వారంతా చాలా బలహీనంగా కనిపించారు. వారందరికీ శక్తినిచ్చే ఆహారం ఇవ్వడానికి ముంతాజ్ వంట వాళ్ళకి అన్నం, మాంసం కలిపి ఒక వంటకాన్ని తయారు చేయమని చెప్పారు. ఆ పదార్థాన్ని వాళ్ళు ఒక పెద్ద గిన్నెలో, అన్నం, బియ్యంతో పాటు మసాలాదినుసులు, కుంకుమపువ్వు వేసి కట్టెల పొయ్యి మీద వండారు.

Origin of biryani in India

చరిత్ర ప్రకారం బిర్యానీ కి సంబంధించి ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే 1398 లో టర్క్ – మంగోల్ చక్రవర్తి అయిన తైమూర్ బిర్యానీని భారతదేశానికి తీసుకువచ్చారు అని అంటారు. బిర్యానీ లో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క బిర్యానీ కి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.


End of Article

You may also like