భారత దేశంలో ప్రతి ప్రాంతానికి ప్రాంతానికి, రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ఆహారం, రుచులు మారుతూ ఉంటాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు ఎన్నో విభిన్నమైన వంటకాలు పర్యాటకుల నోరూరిస్తాయి. వివిధ ప్రాంతాలను బట్టి ఇక్కడ అనేక రకాల ఆహారాలు చాలా ప్రాచుర్యం పొందాయి. కొన్ని వంటకాలు లేకుండా మనకు రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. కానీ అవి మన ఆహారపదార్థాలు కావు అంటే మీరు నమ్ముతారా..??

Video Advertisement

ఆ లిస్ట్ లో ఇప్పుడు ఏ ఏ ఆహార పదార్థాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

#1 సమోసా

అసలు దీని గురించి తెలియని భారతీయుడు ఉండడు. అద్భుతమైన టీటైమ్ స్నాక్ ఇది. ఈ వంటకం మూలాలు పర్షియా (ఇరాన్) నుంచి 10 శతాబ్దానికి ముందు వచ్చాయి. మొదట్లో సమోసా లోపల మాంసం పెట్టి వంట చేసేవారు.

did you know these famous dishes are not originated in india..

#2 గులాబ్ జామున్

స్వీట్స్ కి రారాజు అయిన గులాబ్ జామున్ వాస్తవానికి పర్షియా/మధ్యధరా ప్రాంతానికి చెందినది.

did you know these famous dishes are not originated in india..

#3 రాజ్మా చావల్

ఉత్తర భారతీయులు ఎక్కువగా తినే రాజ్మా చావల్ పంజాబీ ఇళ్లల్లో హాట్ డిష్. దీని మూలాలు మెక్సికో లో ఉన్నాయి.

did you know these famous dishes are not originated in india..

#4 చికెన్ టిక్కా మసాలా

మనం ఎక్కువగా ఇష్టపడి తినే చికెన్ టిక్కా మసాలా దీనిని 20వ శతాబ్దపు చివరిలో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో బంగ్లాదేశ్ చెఫ్ తయారు చేశాడని అంటూ ఉంటారు. బోన్‌లెస్ చికెన్‌లో టొమాటో సాస్‌ని జోడించి అతడు చేసిన ఈ వంటకం అందరికి ఆకట్టుకుంది.

did you know these famous dishes are not originated in india..

#5 ఫిల్టర్ కాఫీ

పొద్దున్న లేవగానే మన నోటికి కమ్మటి టేస్ట్ ని ఇచ్చే ఫిల్టర్ కాఫీ. దీని మూలాలు యెమెన్ లో ఉన్నాయి. ఒక సూఫీ సెయింట్ యెమెన్ నుంచి ఇండియా కి కాఫీ గింజలను తెచ్చాడని అంటారు.

did you know these famous dishes are not originated in india..

#6 జిలేబి

బెంగాల్‌లో జిలాపి, అస్సాంలో జిలేపి, ఇక మన దగ్గర జిలేబి అని పిలిచే ఈ స్వీట్ తొలిసారిగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో తయారు చేసారు.

did you know these famous dishes are not originated in india..

#7 నాన్

ప్రస్తుతం బటర్ నాన్, గార్లిక్ నాన్, స్టఫ్ఫ్డ్ నాన్ ఇలా ఎన్ని పేర్లతో మారినా.. అసలు నాన్ ని మొదట పర్షియన్స్ తయారు చేసారని అంటారు.

did you know these famous dishes are not originated in india..

#8 బిర్యానీ

ఇక మనందరి ఫేవరేట్ బిర్యానీ కూడా మనది కాదు. ఇది పర్షియన్ మూలాలు కలిగిన వంటకం. పర్షియన్ భాషలో బిర్యానీ అంటే ‘ఫ్రైడ్ బిఫోర్ కుకింగ్’ అని అర్థం.

did you know these famous dishes are not originated in india..

#9 టీ

రుచికరమైన కప్పు టీ లేకుండా భారతీయులకు ఉదయాలు ప్రారంభం కావు. ఈ చాయ్ కూడా మనది కాదు. అయితే ఈ చాయ్ పుట్టింది చైనా లో. హాన్ రాజవంశానికి చెందిన చైనీస్ చక్రవర్తి సమాధిలో పురాతన టీ అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

did you know these famous dishes are not originated in india..

#10 ఇడ్లి

పువ్వులా మెత్తగా ఉండి.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉండే ఇడ్లి పుట్టింది ఇండోనేషియా లో.

did you know these famous dishes are not originated in india..