Ads
రామాయణ మహాభారతాలు హిందూ పురాణాలలో మహా కావ్యాలుగా పూజింపబడుతూ యుగయుగాలుగా గౌరవించబడుతున్నాయి. హిందువులు వీటిని కేవలం కధలుగా కాకుండా ఇతిహాసం లేదా చరిత్ర గా భావిస్తారు. రామాయణం కర్తవ్యం గురించి అయితే మహాభారతం విప్లవం గురించి ఉంటుంది.
Video Advertisement
రాముడు సంప్రదాయ నియమాలను పాటించాలని పోరాడుతాడు. కృష్ణుడు కొత్త నియమాలు ప్రారంభించడానికి కష్టపడతాడు. రాముడి పద్ధతుల వల్ల సీత వనవాసం చేయవలసి వస్తుంది. కృష్ణుడి ఆదేశాల మేరకు కురుక్షేత్ర యుద్దం జరగుతుంది.
ఇలా ఈ రెండు గ్రంథాలు మనకి అనేక జీవిత సూత్రాలను బోధిస్తాయి. రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాసారు. రాముడు గురించి, రాముడు నడిచిన మార్గము గురించి వివరించిన మహర్షి నారదుడు. ఇద్దరి మహర్షుల మాటలలో శ్రీరాముడు గొప్పతనమే కీర్తింపబడింది. ఎంతటి కష్టం వచ్చినా, ఎవరు అవకాశం చూపినా, కేవలం ధర్మమునే ఆచరించి చూపిన మార్గదర్శకుడు శ్రీరాముడు.
అలాగే మహాభారతాన్ని కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలను రచించాడు. విష్ణుమూర్తి అవతారమే వ్యాసభగవానుడు అని ప్రతీతి.
రామాయణం త్రేతా యుగం (యుగాలలో రెండవది) లో జరిగితే, మహాభారతం ద్వాపర యుగం (మూడవ యుగం) లో జరిగింది. ఈ రెంటి నడుమ చాలా సంవత్సరాల వ్యత్యాసం (బహూశా కొన్ని మిలియన్ల సంవత్సరాలు) ఉంది.
అయితే మనకి ప్రస్తుతం అన్ని కావ్యాలు పుస్తకాల రూపం లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని రాసినప్పుడు అవి తాళ పత్రాలపై రాసారు. వాటిలో చాలా వరకు జీర్ణమైపోగా.. కొన్ని ఒరిజినల్ పత్రాలు ప్రపంచం లోని పలు మ్యూజియం లలో ఉన్నట్లు తెలుస్తోంది.
మహాభారతం తర్వాత వ్యాసుడు రాసిన అన్ని గ్రంథాలను తక్షశిల లోని ఒక గ్రంథాలయం లో భద్రపరచగా.. వాటిని అలెగ్జాన్డర్ దండయాత్రలో నాశనం చేసినట్లు చరిత్ర లో ఉంది. వాటిలో కొంతవరకు భద్రపరచి ప్రపంచ దేశాల్లోని పలు పురావస్తు ప్రదర్శన శాలల్లో పెట్టినట్లు తెలుస్తోంది.
End of Article