సివిల్స్ లో టాప్ ర్యాంకర్స్.. కానీ వీరికి ఎంత తక్కువ మార్కులు వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు..!

సివిల్స్ లో టాప్ ర్యాంకర్స్.. కానీ వీరికి ఎంత తక్కువ మార్కులు వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు..!

by Anudeep

Ads

సివిల్స్ సర్వీస్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించడం అనేది ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. అంత ఈజీగా పాస్ అవ్వలేరు. పుస్తక పరిజ్ఞానంతో పాటు కాస్త లోక జ్ఞానం కూడా ఉంటేనే ఇటువంటి పరీక్షలలో పాస్ అవ్వగలుగుతాము. అంతేకాదు.. నిరంతర శ్రమ పట్టుదలతో ఈ పరీక్షలకు ప్రిపేర్ అయితేనే విజయం సాధించడం సాధ్యం అవుతుంది.

Video Advertisement

అయితే.. లక్షల మంది పరీక్షకు హాజరు అవుతుంటారు. కానీ, వీరిలో కొన్ని వందల మంది మాత్రమే ఉత్తీర్ణులు అవుతుంటారు. 2021 సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు. కానీ, వీరిలో 685 మంది మాత్రమే పాసయ్యారు.

civil toppers

అంటే.. ఈ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే.. ఈ సారి పరీక్షలలో మొదటి మూడు స్థానాలలోను అమ్మాయిలే విజయం సాధించడం గమనార్హం. అయితే.. వీరందరికీ సివిల్ సర్వీసెస్ లో వచ్చిన మార్కులు ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. అంటే అంత తక్కువ మార్కులు వచ్చాయన్నమాట. సాధారణంగా ఏదైనా టాప్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చారు అంటే.. వారికి ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయని మనం అనుకుంటాం.

civil toppers 1

కనీసం 80-90 శాతం మార్కులు అయినా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే.. సివిల్స్ లో మాత్రం ఆ స్థాయిలో మార్కులు రావాలంటే చాలా కష్టం. టోటల్ మార్కులు 2025 అయితే.. అందులో కనీసం సగం మార్కులు తెచ్చుకున్నా టాప్ 10 స్థానాలలో చోటు దక్కించుకోవడం కష్టమే. సివిల్స్ లో ఇప్పటివరకు సాధించిన హైయెస్ట్ పర్సంటేజ్ ఎంతో తెలుసా..? కేవలం 55.50 మాత్రమే. 2021 లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన శృతి శర్మ 54.56 శాతం మార్కులు తెచ్చుకున్నారు. అంటే.. 1105 మార్కులు సాధించారు. 1750 మార్కులకు గాను మెయిన్స్ లో 932 మార్కులు, ఇంటర్వ్యూలో 275 మార్కులకు గాను 173 మార్కులు ఆమె సొంతం చేసుకున్నారు. రెండవ స్థానంలో నిలిచిన అంకిత అగర్వాల్ మెయిన్స్ లో 871, ఇంటర్వ్యూలో 275 కి 179 మార్కులు తెచ్చుకున్నారు. ఇక మూడవ స్థానంలో నిలిచిన గామిని 1045 స్కోర్ చేసారు.


End of Article

You may also like