పిండప్రదానాలు కాకులకే ఎందుకు పెడతారో తెలుసా..? వెనకున్న కారణం ఇదే.!

పిండప్రదానాలు కాకులకే ఎందుకు పెడతారో తెలుసా..? వెనకున్న కారణం ఇదే.!

by Anudeep

Ads

హిందూ సంప్రదాయాలు ఎన్నో శతాబ్దాల కాలం గా భారత్ లో అనుసరింపబడుతూ వస్తున్నాయి. హిందూ సంప్రదాయం లో చెప్పబడ్డ అనేక ఆచారాలకు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని పెద్దలు మనకు విశదీకరించి చెప్పకపోయినా, ఇప్పటికీ పలు సందర్భాలలో సైన్స్ వాటి ప్రాముఖ్యతను గుర్తిస్తూ వస్తోంది. అలా హిందూ సంప్రదాయాల ప్రకారం, అనాది గా వస్తున్న ఆచారం పిండప్రదానం. ఈ లోకాన్ని వీడిన పితృదేవతల కోసం మనం ఈ క్రతువుని నిర్వహిస్తూ ఉంటాము.

Video Advertisement

pinda pradanam feature image

అయితే, ఎక్కువగా పుష్కరాల సమయం లో చాలా మంది నది వద్ద పితృ తర్పణాలు వదిలి పిండప్రదానం చేయడం మనం చూస్తూనే ఉంటాం. పితృ పక్షాల కాలం లో కూడా పిండప్రదానం నిర్వహిస్తూ ఉంటారు. పిండ ప్రదానం ను కాకులకు మాత్రమే పెడతారుల. సాధారణ రోజుల్లో కాకులు వాలితే దోషం గాను, కాకి కాలితో తంతే వారికి సంక్షోభం రాబోతోందని మనం భావిస్తూ ఉంటాం. అలాంటిది.. పితృ పక్షాల సమయం లో మాత్రం కాకిని పితృ దేవత గా భావిస్తూ పిండ ప్రదానం చేస్తాం. ఇలా కాకికి పిండ ప్రదానం చేసే విషయమై చాలా సందేహాలు ఉన్నాయి. నిజం గానే పితృదేవతలు కాకుల రూపం లో వస్తారా? అన్న విషయానికి ఇంకా స్పష్టత లేదు.

tarpanam

మన ఇంట్లో ఎవరైనా చనిపోతే, వారు కాకుల రూపం లోనే వచ్చి.. పిండ ప్రదానం గా చేసిన ఆహారాన్ని స్వీకరిస్తారన్న నమ్మకం పురాణకాలం నుంచే వుంది. ఒక వ్యక్తి మరణించాక, కర్మకాండల్లో భాగం గా వారికి పిండప్రదానం చేసి, ఆ పిండాన్ని కాకులకు ఆహరం గా వేయడం ముత్తాతల కాలం నుంచి చూస్తున్నాం. కాకులు ఆ పిండాన్ని పూర్తి గా తింటే పెద్దలు సంతృప్తి చెందారని, ఆహరం ముట్టకుండా వదిలేసి వెళ్ళిపోతే..వారి కోరికలు తీర్చలేదని పెద్దలు అసంతృప్తి తో ఉన్నారని భావిస్తారు. అవేంటో తెలుసుకుని, ఆ కోరికలను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.

దీని గురించి వివరం చెప్పే కథ రామాయణం లో ఉంది. పూర్వం యముడు రావణుడికి భయపడి కాకులకు వరాలను ఇస్తాడు. యముడు అందరికి హాని చేస్తాడు కాబట్టి, ఆయన స్వయంగా కాకి రూపాన్ని ధరిస్తాడు. మరణించిన తరువాత యమలోకం లోకి వెళ్లి నరకబాధలు అనుభవిస్తూ ఉంటారు. ఆ మరణించిన వారి కుటుంబ సభ్యులు ఎవరైనా పిండ ప్రదానం చేస్తే, ఆ పిండాన్ని కాకులు పూర్తి గా తిన్నప్పుడే వారికి ఆ నరకబాధల నుంచి విముక్తి కలుగుతుంది.

ఈ వరాన్ని యముడు కాకులకు ఇవ్వడం వల్లనే, పిండ ప్రదానాన్ని కాకులకే చేస్తారు. ఇప్పటికి ఆ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. దీనివెనకాల ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. అప్పట్లో పశుపక్ష్యాదులు ఆహరం లేక అలమటించేవి. ముఖ్యం గా కాకులు ఎక్కువ సంఖ్యలో ఉండేవి, మరియు వాటిని అందరు దూరం పెట్టేవారు. దీనితో, వాటికి కూడా ఆహారంగా అందాలనే ఉద్దేశం తోనే ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారని చెప్తారు.


End of Article

You may also like