ఏ పూజ కు అయినా ముందు వినాయకుడిని ఆరాధించడం తప్పనిసరి. అలాంటిది సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు జన్మించిన చవితి రోజున.. ఆయనకు మరింత విశేషం గా పూజలు చేసుకుంటూ ఉంటాం. వినాయక ఉత్సవాలు దేశమంతటా ఘనం గా జరుగుతాయి. నవరాత్రులు ఆ విఘ్నేశ్వరుడిని కీర్తించి.. ఆ తరువాత తొమ్మిదో రోజు రాత్రికి నిమజ్జనం చేస్తారు. ఈ తొమ్మిది రోజులు దేశమంతా విశేషం గా సంబరాలు జరుగుతాయి.

ganesh chaturdhi 1

ఈ సంబరాల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరు పాల్గొంటూ భజనలు, కీర్తనలు చేస్తుంటారు. సందుకో పందిరి వెలుస్తుంది. గణేష్ నవరాత్రుల రోజుల్లో ప్రతి ఊరు, ప్రతి పేట లో కనిపించే సందడి మాములుగా ఉండదు. ఐతే.. డీజే లు వచ్చాక ఈ భక్తికి కొంచం అర్ధం మారిందనే చెప్పాలి. తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తూ.. పాటలను కూడా ప్లే చేస్తూ ఉంటారు. ఈ డీజే లు వచ్చిన మొదట్లో కనీసం భక్తి పాటలు పెట్టేవారు.

ganesh chaturdhi 1

రాను రాను.. కొంతమంది మరింత దిగజారి పోతున్నారు. భక్తి పాటలను పక్కకు పెట్టేసి.. మాస్ మసాలా సాంగ్స్ ని ప్లే చేస్తూ.. గణపతి మండపాల్లోనే పిచ్చి గెంతులు వేస్తున్నారు. తొమ్మిది రోజులు భక్తి పారవశ్యం లో మునిగి తేలాల్సింది పోయి.. ఈ పాటలను పెట్టడం వలన అసలు గణేష్ నవరాత్రుల వెనక ఉద్దేశ్యాన్ని వదిలేస్తున్నారు. దేశానికి స్వతంత్రం రాకమునుపే.. బాల గంగాధర తిలక్ ఇలా గణేష్ నవరాత్రులను ఇంట్లో కాకుండా.. సంఘం తో కలిసి బహిరంగం గా చేయించడం ప్రారంభించారు.

ganesh chaturdhi 2

ఈ గణేష్ నవరాత్రులలో ప్రతి ఊరిలో, ప్రతి పట్టణం లో ఉండే యువకులు ఉత్సాహం గా చందాలు పోగుచేసి పందిరి వేసి గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేయించేవారు. అలా వారి మధ్య ఐక్యత, భక్తి భావం పెంపొందాలి అనే ఉద్దేశం తోనే.. ఆ రోజుల్లో బాల గంగాధర్ తిలక్ నవరాత్రుల ఉత్సవాల్ని ఊరంతా కలిసి వేడుకగా జరుపుకోవాలి అని పిలుపునిచ్చారు. కానీ.. రాను రాను అసలు ఉద్దేశ్యం వెనకబడి.. మసాలా పాటల ల హంగామా ఎక్కువవుతోంది. చాలా చోట్ల బుల్లెట్టు బండి, భూమ్ బద్దల్ వంటి సాంగ్స్ ను ప్లే చేస్తున్నారు. వీటిని చూస్తుంటే.. అసలు భక్తి ఎక్కడ ఉంది..? ఇంతలా దిగజారిపోతున్నారు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. వినాయక మండపాల్లో ఐటెం సాంగ్స్ ను ప్లే చేయడం పై ట్రెండ్ అవుతున్న ఈ ట్రోల్ పై ఓ లుక్ వేయండి.

Watch Video: