Ads
ప్రస్తుతం మారుతున్న సమాజం లో చాలా మంది కంప్యూటర్లపైనే పని చేస్తున్నారు. దీనివలన శారీరక శ్రమ చాలా తగ్గిపోతోంది. ఎక్కువ భాగం కూర్చునే పని చేయాల్సి ఉంటోంది. దీనివలన మూత్ర పిండాలపై ఒత్తిడి పడుతుందని మీకు తెలుసా..? మూత్రపిండాలు మన శరీరం లో కీలకమైన అవయవాలు. ఇవి మన శరీరం లోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తూ మన శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచుతాయి. కానీ శారీరక శ్రమ తగ్గడం వలన.. మన కిడ్నీలకు కలిగే ఇబ్బందులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Video Advertisement
విసర్జన వ్యవస్థలో ముఖ్య భాగాలైన మూత్రపిండాలు (కిడ్నీలు) రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తాయి. రక్తం లోని అవాంఛిత కణాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి. రక్తాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా మలినాలను వేరు పరిచి మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపించేస్తాయి. మూత్రపిండాల ద్వారా శుభ్రపడిన రక్తం తిరిగి శరీరం లో అన్ని ఇతర అవయవాలకు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే, ఈ మూత్రపిండాలను మనం ఎల్లప్పుడూ ఆరోగ్యం గా ఉంచుకోవాలి. అందుకోసం తగినంత గా నీరుని తాగుతూ ఉండాలి. తగినంత నీరు అందుబాటులో ఉంటేనే, మూత్రపిండాలు ఈ వ్యర్ధాలను నీటితో బయటకు పంపగలవు.
మీరు తగినంత గా మంచినీటిని తాగకపోతే, ఈ వ్యర్ధాలు పూర్తి స్థాయిలో బయటకు పోవు. తద్వారా, ఈ వ్యర్ధాలన్నీ కిడ్నీలలోనే పేరుకుపోయి రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ రాళ్లు మూత్ర కోశం వద్ద పేరుకుపోతాయి. మీకు మూత్ర విసర్జన చేస్తున్నపుడు ఎప్పుడైనా విపరీతమైన మంట గా అనిపించిందా..? దానికి కారణమేమిటంటే.. ఆ స్థానం లో ఈ రాళ్లు అడ్డుపడడం వలన ఇలా జరుగుతుంటుంది. వంశపారంపర్యం గా గాని, డీ హైడ్రేషన్ వలన కానీ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
మూత్ర విసర్జన చేస్తున్న సమయం లో మీకు తరచుగా మంట గా అనిపిస్తూ ఉంటె, మీరు తక్షణమే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఒకవేళ కిడ్నీలలో రాళ్లు ఏర్పడి ఉంటె.. వాటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. రాళ్లు చిన్న చిన్న పరిణామాలలో ఉన్నపుడు సహజం గా మూత్రం ద్వారా బయటకు పంపేయవచ్చు. కానీ, రాళ్లు పెద్ద సైజు లో ఉంటె మాత్రం శస్త్ర చికిత్స తప్పనిసరి అవుతుంది. ఈ చికిత్స తరువాత ఆరోగ్యపరం గా ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే, క్రమం తప్పకుండ వ్యాయాయం చేయడం, ఎక్కువ మంచి నీటిని తీసుకోవడం ద్వారా ఈ ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
End of Article