బాలయ్య వ్యాఖ్యాతగా ఆహాలో అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ షో లో ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు గెస్టులు గా పాల్గొన్నారు. కాగా ఈ షో కి తాజాగా యంగ్ రెబెల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. ఈ షో లో ఆయన తన స్నేహితుడు హీరో గోపీచంద్ తో కలిసి పాల్గొన్నాడు.

Video Advertisement

 

అయితే ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్న విషయాన్ని ‘ఆహా’ టీం అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఆ షో గ్లింప్స్ కోసం ప్రభాస్ ఫాన్స్ ఆతృతగా ఎదురు చూసారు. నిన్న ఆ గ్లింప్స్ విడుదల చేసారు ఆహా టీం. అనుకున్న సమయానికన్నా చాలా లేట్ గా విడుదల చేసింది. కానీ ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

prabhas fans disappointed about unstoppable glimps..

బాహుబలి మీట్స్ బాలయ్య కాప్షన్ తో ఆహా నిర్వాహకులు ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెంచేశారు. కూల్ గా షో లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అభిమానులకు ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చి ఆశ్చర్య పరిచారు. కానీ ప్రభాస్ వంటి స్టార్ వస్తున్నాడంటే గ్లింప్స్ తోనే ఆ హడావిడి కనిపించాలి. కానీ గ్లింప్స్ లో హైలైట్ ఏమి లేదు. ‘ ఏం చెప్తున్నావ్ డార్లింగ్’ అనే ప్రభాస్ డైలాగ్ ఒక్కటి తప్ప.

prabhas fans disappointed about unstoppable glimps..

ఈ ఎపిసోడ్ లో బాలయ్య ఏమేం ప్రశ్నలడిగాడు అని ప్రభాస్ ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కనీసం ప్రోమో లో అయినా ఏమైనా హైలైట్ పాయింట్స్ ఉంటాయా అని ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క ప్రభాస్ సినిమా అప్డేట్ ల కోసమే ఎదురు చూస్తూ.. మరోవైపు ఇలాంటి వీడియోల కోసం కూడా ఫాన్స్ ఎదురు చూడాల్సి వస్తుందని ఫాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.