ఆ ఛాలెంజులు కాదు కావాల్సింది. ప్రణీతను చూసి నేర్చుకోండి!

ఆ ఛాలెంజులు కాదు కావాల్సింది. ప్రణీతను చూసి నేర్చుకోండి!

by Sainath Gopi

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వ్యాధిని నియంత్రించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా మంది సెలెబ్రిటీలు రకరకాల ఛాలెంజ్ లు పెడుతూ సోషల్ మీడియాలో అభిమానులని ఆకట్టుకుంటున్నారు. ఒకరేమో పిల్లో ఛాలెంజ్ అని, మరికొందరు ట్రెడిషనల్ డ్రెస్ ఛాలెంజ్ అని. ఇంకొందరు అయితే పరిస్థితితో సంభందం లేకుండా మేకప్ ఛాలెంజ్ లు అంటూ చేస్తున్నారు. కానీ ఈ సందర్భంలో ప్రణీత చేసిన పనికి రియల్ హీరోయిన్ అంటూ పొగుడుతున్నారు నెటిజెన్స్.

Video Advertisement

కరోనా వైరస్ లాక్ డౌన్ వేళ తారలు తమవంతు సహాయం గా ఎవరికి వారు స్వచ్చందంగా సహాయం చేస్తూ మానవత్వం చాటుకున్నారు.అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు సహాయం చేసారు..కొందరు ధనం రూపంలో సహాయం చేస్తే మరికొందరు రోజు వారి కూలీలకు ఆహారం అందించే సహాయం చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 5000 రూ వరకు ఇచ్చారు.

Image Credits : Pranitha subash Instagram Profile

ఇక పోతే కరోనా వైరస్ నేపథ్యం లో సహాయం చేయడానికి హీరోయిన్స్ లో ముందుగా వచ్చి సహాయం చేసింది మాత్రం ‘ప్రణీత సుభాష్’ గారే అని చెప్పాలి.తనకు అప్పుడు ఎప్పుడో అత్తారింటికి దారేది, రభస తరువాత మళ్ళీ పెద్దగా తెలుగు లో చెప్పుకోతగ్గ సినిమాలు ఏవి రాలేదు అనే చెప్పాలి.తన వంతు గా శక్తికి మించి సహాయం చేసారు ప్రణీత సుభాష్. రీసెంట్ గా పేద ప్రజలకోసం ఆమె ఫుడ్ తయారు చేయించి పంపిణి చేసారు. వీటికి సంభందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .అందులో తనే స్వయంగా వంట వండుతున్న వీడియో కూడా ఉంది.

వీటిని చూసిన నెటిజెన్స్ ఆమెపై ఎన్నో ప్రశంసలు గుప్పిస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా కేవలం ఇంటి వరకే పరిమితం అవ్వకుండా సామాజిక సేవ చేస్తూ..అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రణీత.ఇది ఇలా ఉండగా కరోనా నేపథ్యం లో సినీ కార్మికుల కోసం చిరంజీవి సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ) ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

లాక్ డౌన్ వేళ ప్రజలకు సాయం చేయడంలో  ప్రకాశ్ రాజ్ కూడా తనదైన ముద్రతో సాగిపోతున్నారు..ప్రకాశ్ రాజ్ చేసే సాయం ఏ విధంగా ఉంటుందంటే కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదన్నట్టు. లాక్ డౌన్ వేళ 30మంది వలస కార్మికులకు తన ఫాం హౌజ్లో ఆశ్రయం ఇచ్చి వారికి కావలసిన భోజన వసతి సౌకర్యాలు చూస్తున్నారు. అదేవిధంగా తను దత్తత తీసుకున్న కొండారెడ్డి పల్లి గ్రామస్తుల అవసరాలు తీరుస్తున్నారు.

ఉన్న డబ్బు అంతా ఖర్చు పెడితే మీ కుటుంబ పరిస్థితి ఏంటి అని ఒక న్యూస్ ఛానెల్ వారు  అడిగిన ప్రశ్నకు ప్రకాశ్ రాజ్ ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా?? “నా తల్లి అనాధశ్రమంలో పెరిగింది. నా చిన్నప్పుడు తను నర్సుగా పనిచేసేది..వచ్చేది 2000జీతం, ఎవరైనా సాయం అడగితే, తన దగ్గర డబ్బులు లేకపోతే చెవులకు ఉన్న బంగారం ఇచ్చేది. అంతా ఇచ్చేస్తే మనకెలా అమ్మా అని నేను అడిగితే ‘మనకి ఎవరైనా అప్పు ఇస్తారు, పని చేసుకునే శక్తి ఉంది, మన దగ్గర ఉన్నది ఇస్తే, మనకి వస్తాయి అనేది.నేను ఇప్పుడు ఇస్తూనే ఉన్నాను,నేను పనిచేస్తే నాకు వస్తూనే ఉంటాయి అని సమాధానం ఇచ్చారు.


You may also like