Ads
ప్రస్తుతం కరోనా మహమ్మారి మరింత ఉధృతం గా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. దేశమంతా కరోనా సెకండ్ వేవ్ కారణం గా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. శ్వాస లో ఇబ్బందులు, జ్వరం రావడం, ప్లేట్ లెట్స్ కౌంట్ డౌన్ అవడం వంటి ఇబ్బందులతో పలువురు హాస్పిటల్స్ కె పరిమితమవుతున్నారు. కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. కరోనా ను మరింత సీరియస్ గా తీసుకుని నియమాలను పాటించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
Video Advertisement
మరో వైపు.. కరోనా వచ్చి తగ్గిన వారు తమకు ఇంకా ఏ భయం లేదని అనుకుంటున్నారు. చాలా మంది లో కరోనా వచ్చి తగ్గినతర్వాత తీవ్ర అలసటను ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణం గా ఎవరికైనా ఫ్లూ జ్వరం లేదా జలుబు వంటి జబ్బులు వచ్చి తగ్గిన తరువాత వారు సమర్ధవంతం గా తయారవుతారు. వారికి తొందరగా జబ్బు చేసే అవకాశం ఉండదు. కానీ.. కరోనా వచ్చి తగ్గిన తర్వాత చాలా మంది బలహీనం అయిపోతున్నారు. కొన్ని రకాల వైరస్ లో మూడు నెలల కంటే ఎక్కువ టైం వరకు శరీరం లోనే జీవించగలవు. అందుకే కరోనా వచ్చి పోయిన వారు కూడా విధిగా జాగ్రత్తలు పాటించాలి.
చికిత్స తీసుకున్న తరువాత మీకు నెగటివ్ వచ్చిందా..? అయితే మీకు రోగ నిరోధక శక్తీ పెరిగిందనే అర్ధం. కానీ.. కరోనా సోకాక నెగటివ్ వచ్చినా కూడా వారు చాలా వీక్ గా ఉంటున్నారు. ఈ క్రమం లో ఆ వైరస్ శరీరం లో ఎక్కడైనా దాక్కుని ఉండవచ్చు. పరీక్షలో నెగటివ్ వచ్చినా ఈ మహమ్మారి పూర్తి గా వదిలినట్లు చెప్పలేకపోతున్నారు. ఈ వైరస్ శక్తిని పెంచుకుని తిరిగి దాడి చేసే అవకాశం ఉండొచ్చని కూడా వైద్యులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వలన వచ్చే అలసట ను పోగొట్టుకుని శక్తివంతం గా తయారు అవ్వవచ్చు.
ఖర్జూరం, ఎండుద్రాక్ష, బాదాం, వాల్ నట్స్ వంటి తేలిక గా జీర్ణం అయ్యి, ఎక్కువ గా బలాన్ని ఇచ్చే ఆహారాన్ని మీ డైట్ లో భాగం చేసుకోండి. వీటిని నాన బెట్టి తీసుకోవడం మంచి పధ్ధతి. ప్రొసెస్డ్ ఫుడ్స్, చక్కర ఎక్కువ గా ఉన్న ఆహార పదార్ధాలను దూరం పెట్టడమే ఉత్తమం. భోజనం చేసాక ఓ గంట తరువాత, ధనియాలు,జీలకర్ర తో చేసిన టీ తాగండి. వారానికి మూడు సార్లు సూప్ తీసుకుంటే మంచిది. ఉదయం లో ఎండలో సమయం గడపడం.. రాత్రి తొందరగా నిద్రపోవడం మంచి అలవాట్లు. మీరు తొందరగా రికవర్ అవడానికి దోహదం చేస్తాయి. వ్యాయాయం చేయడం, ధ్యానం చేయడం కూడా తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి..
End of Article