టాబ్లెట్ వేసుకునేటపుడు మీరు కూడా ఇలాంటి తప్పు చేస్తున్నారా..? ఇక పై సరి చేసుకోండి..!

టాబ్లెట్ వేసుకునేటపుడు మీరు కూడా ఇలాంటి తప్పు చేస్తున్నారా..? ఇక పై సరి చేసుకోండి..!

by Anudeep

Ads

టాబ్లెట్స్.. మనకి ఏ చిన్న జబ్బు వచ్చినా వెంటనే గుర్తుకు వస్తాయి. ఓ టాబ్లెట్ వేసుకుని పడుకున్నామంటే అన్ని సెట్ అయిపోతాయి. ఎప్పటిలా హుషారు గా తిరగగలుగుతుంటాం. పదే పదే టాబ్లెట్స్ వాడడం అంత మంచిది కాదు. కానీ, ప్రాణం మీదకి వచ్చినపుడు, అత్యవసర పరిస్థితి లో టాబ్లెట్ ను వేసుకోవడం తప్పని సరి. అయితే, ఈ టాబ్లెట్ ను వేసుకునే ముందు మనలో చాలా మంది చిన్న పొరపాటు చేస్తుంటారు.

Video Advertisement

tablets 1

దీని గురించి ఒక కోరా యూజర్ ఏమని తెలిపారంటే, మనం టాబ్లెట్ వేసుకునే ముందు కచ్చితం గా ఎక్స్ పైరీ డేట్ ను చూసుకుని వేసుకుంటాం కదా. కానీ, చాలా టాబ్లెట్స్ పైన ఈ ఎక్స్ పైరీ డేట్ ఒక మూలన ఇవ్వబడుతుంది. ఈ డేట్ ఒక్క టాబ్లెట్ పైనో లేదా రెండు టాబ్లెట్స్ పైనో ఉంటుంది. కానీ, మనం టాబ్లెట్ వేసుకునేటపుడు ఇది గమనించకుండా చింపేస్తు ఉంటాం. ఒక పది టాబ్లెట్స్ వరస గా ఉన్న స్ట్రిప్ ను కొన్నపుడు, అందులో కేవలం కొన్ని వాడి వదిలేస్తుంటాం.

tablets 2

ఆ తరువాత మరెప్పుడైనా డాక్టర్ అదే మెడిసిన్ ను రెఫెర్ చేసినపుడు తిరిగి దానిని వాడాలంటే, దానిపై ఎక్స్ పైరీ డేట్ కనిపించదు. రిస్క్ ఎందుకులే అని మనం దానిని వృధా గా పడేస్తుంటాం. కానీ, ముందు మనం వాడేటప్పుడు ఎక్స్ పైరీ డేట్ ఉన్న టాబ్లెట్ ను పక్కన పెట్టి మిగతావి వాడడం వలన వృధా ను తగ్గించవచ్చు. అలానే, ఎక్స్ పైరీ డేట్ ఉన్న టాబ్లెట్ పై ఏదైనా సెల్లో టేప్ ను వేసేసి ఉంచితే, మనకి మరింత కన్వీనియెంట్ గా ఉంటుంది. మనం ఎక్స్పైరీ డేట్ ను చూడాలనుకున్నపుడు ఆ టేప్ ను తీసి చూస్తే సరిపోతుంది.


End of Article

You may also like