సాధారణంగా ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తొచ్చేవి రెండే రెండు. ఒకటి సినిమా, ఇంకొకటి క్రికెట్. ఈ రెండిట్లో సినిమాలకి ఎక్కువ మంది అభిమానులు ఉంటారో, క్రికెట్ కి ఎక్కువ మంది అభిమానులు ఉంటారో చెప్పడం కష్టం. ఉమెన్ క్రికెట్ లో తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ప్లేయర్ ప్రియా పునియా. ప్రియా పునియా తన క్రికెట్ ప్రయాణాన్ని ఢిల్లీ నుంచి ప్రారంభించారు.

రాజ్ ‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాలు శిక్షణ తీసుకున్నారు ప్రియా పునియా. ఇంకొక విషయం ఏంటంటే రాజ్ ‌కుమార్ శర్మ, విరాట్ కోహ్లీ చిన్నప్పటి కోచ్. 2018 లో క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్రియా పునియా, తన ఆటతీరుతో మొదటి నుండి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటి వరకు 5 వన్డేలు, 3 టి 20 లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

నవంబర్ 2020 లో మహిళల టి 20 ఛాలెంజ్‌ లో కూడా పాల్గొన్నారు ప్రియా పునియా. ఇందులో సూపర్ నోవాస్ జట్టు తరపున ఆడారు. గురువారం రోజు తన ఇంస్టాగ్రామ్ లో ఒక చాట్ సెషన్ ద్వారా తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు ప్రియా పునియా. ఈ చాట్ సెషన్ లో ఒకరు “బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? అని ప్రియా పునియాని అడిగారు.

దానికి జవాబుగా ప్రియ ఆశ్చర్యపడుతున్నట్టు రియాక్షన్ ఇస్తున్న ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఒక వేళ క్రికెట్ ప్లేయర్ కాకపోయి ఉంటే బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యి ఉండేదాన్ని అని చెప్పారు. సౌత్ ఇండియన్ యాక్టర్స్ లో, తనకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పారు.

watch video:


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com