నాతో బ్రేకప్ చెప్పేసాక.. తను ప్రెగ్నంట్ అని తెలిసింది.. ఇప్పుడు మా రిలేషన్ షిప్ సమస్యకి పరిష్కారమేంటి..?

నాతో బ్రేకప్ చెప్పేసాక.. తను ప్రెగ్నంట్ అని తెలిసింది.. ఇప్పుడు మా రిలేషన్ షిప్ సమస్యకి పరిష్కారమేంటి..?

by Anudeep

ఒకప్పటి ప్రేమకి.. ఈ కాలంలో మనుషుల మధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ మధ్య ప్రేమ వివాహాలు, ప్రేమికులు ఎక్కువగానే ఉంటున్నప్పటికీ.. బంధాల నిలకడ మాత్రం తక్కువగానే ఉంటోంది. తాజాగా.. ఓ వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పిందని.. తన సమస్యకి పరిష్కారం చెప్పాలని కోరుతూ పంపిన మెసేజ్ ఇది.

Video Advertisement

 

నా పేరు ఆదిత్య (సెక్యూరిటీ కారణాల వలన పేరు మార్చాం). నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడే దివ్య (పేరు మార్చాము) ని ఇష్టపడ్డా. స్నేహం తో మొదలైన మా బంధం ప్రేమ వరకు వచ్చింది.

breakup 3

మా బంధాన్ని మరింత పదిలంగా కాపాడుకోవడం కోసమే ఒకే కంపెనీ లో జాబ్ కూడా సంపాదించాం. అంతా బాగుంది అనుకున్న టైం లో మా మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. మొదట్లో తను నాలో ఏవి చూసి ఇష్టపడిందో.. వాటినే ఇప్పుడు ద్వేషిస్తోంది. క్రమంగా ప్రేమ మాయమై నేనంటే ద్వేషం పెంచుకుంటూ వచ్చింది.

 

breakup 1

మా మధ్య దూరం పెరుగుతూ.. చివరకు తను మాట్లాడడం మానేసేవరకు వచ్చింది. ఓ వీక్ ఆఫ్ రోజు తనతో మాట్లాడాలని ఫిక్స్ అయిపోయి.. తన ప్రాబ్లెమ్ ఏంటి అని అడిగాను.. మాట..మాట పెరిగి.. చివరకు నాతో ఉండడం ఇష్టం లేదని.. ఈ బంధాన్ని ఇక్కడితో వదిలేయాలని బ్రేక్ అప్ చెప్పేసింది. తను మరో ఫ్లాట్ కి మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది.

breakup 2

అంతలోనే ఓ రోజు కళ్ళు తిరిగి పడిపోతే.. ఆసుపత్రికి తీసుకెళ్లా.. తీరా, వెళ్ళాక తెలిసింది ఏంటంటే..తను గర్భవతి అయ్యింది. ఇప్పుడు తను మౌనంగా ఉంటోంది. ఏ పని పట్ల ఆసక్తి లేకుండా ఉంటోంది. పుట్టబోయే బిడ్డ కోసం కలిసి ఉండాలా..? లేక నేనంటే ఇష్టం లేని అమ్మాయితో ఎందుకు ఉండాలి అని అలోచించి వదిలేయాలా..? అర్ధం కావడం లేదు. నా సమస్యకి తగిన పరిష్కారం తెలపగలరు.

Note: Photos in this post are for reference purposes only. They are not the actual characters.


You may also like