40 ఏళ్లు దాటిన పురుషులు ఎదుర్కొనే 4 ప్రధాన సమస్యలు ఇవే..!

40 ఏళ్లు దాటిన పురుషులు ఎదుర్కొనే 4 ప్రధాన సమస్యలు ఇవే..!

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి, అనారోగ్య ఆహార అలవాట్లు మరియు స్ట్రెస్ కారణంగా చాలా మంది మగవారు తరచుగా ఇబ్బందికి గురి అవుతున్నారు.

Video Advertisement

ముఖ్యంగా 4 పదుల వయసులో ప్రవేశించిన వారు తమ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి 40 ఏళ్లు దాటిన మగవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం…

men

#1 వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. అయితే ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలి అలవర్చుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. నేడు ఎక్కువమంది గంటల కొద్దీ కూర్చోని పని చేసే పరిస్థితి కారణంగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఎక్కువ దూరం ట్రాఫిక్ లో బైక్స్ నడిపే వారికి కూడ నడుము సమస్యలు మొదలవుతాయి.

men

#2 వయసు పెరిగే కొద్ది ఎముకల సాంద్రత తగ్గడం వల్ల కీళ్ల సమస్యలు తలెత్తుతాయి. కాస్త దూరం నడిచిన మోకాలు పట్టుకునే పరిస్థితి కొంతమందిలో మనం గమనిస్తాం. మొదట్లో చూడడానికి ఇవి చాలా చిన్న సమస్యలుగా ఉన్నప్పటికీ అశ్రద్ధ చేస్తే మాత్రం జటిలంగా మారుతాయి. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోకపోతే శరీరంలో క్యాల్షియం లోపం తలెత్తుతుంది.

men

#3 40 దాటిన మగవారికి టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ప్రారంభ దశ లోనే ఈ వ్యాధి లక్షణాలు గుర్తిస్తే చికిత్స సాధ్యపడుతుంది. అలాగే స్ట్రెస్ కారణంగా వీరికి తరచూ తలనొప్పి కూడా వచ్చే ఆస్కారం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే వీరిలో అజీర్తి కారణంగా యాసిడ్ రిఫ్లెక్స్ మరియు ఛాతీలో మంట లాంటి సమస్యల వచ్చే అవకాశం ఉంది.

men

#4 వ్యాయామం చేయకపోవడం మరియు సరైన ఆహారం తీసుకోక పోవడం కారణంగా పొట్ట పెరగడం, అధిక బరువు లాంటి సమస్యల వస్తాయి. స్ట్రెస్ మరియు డిప్రెషన్ వల్ల మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశముంది. మంచి పౌషటికాహారం, ఫ్రెష్ ఫ్రూట్, వెజిటబుల్స్ మరియు రోజు వ్యాయామం వీరిని ఫిట్ అండ్ హెల్తీ గా ఉంచుతుంది.

ALSO READ : “నైటీలు” పగలు వేసుకోవడం వల్ల కలిగే ఈ నష్టాల గురించి తెలుస్తే…ఆడవాళ్ళు ఇంకోసారి ఆ తప్పు చేయరు.!


End of Article

You may also like