సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరి ప్రత్యేకతను ఇట్టే గుర్తుపట్టొచ్చు. వందలో తొంభై మంది కుడి చేతి వాటం వాళ్లే ఉండగా, ఎడమ చేతి వాటం వాళ్లు అరుదుగా ఉంటారు. అందుకే వీరెక్కడ కనపడినా ప్రత్యేకంగా చూస్తాం. అందుకే కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌ అన్నాడో సినీ కవి.

Video Advertisement

ఎవరైతే కుటుంబంలో మొదట పుడతారో వాళ్ళకి 18, 19 వచ్చినప్పుడు ఐక్యూ 2.3 పాయింట్లు కంటే ఎక్కువగా ఉందని తేల్చారు వైద్య నిపుణులు. అయితే ఎడమచేతితో రాసేవారూ, కుడి చేత్తో రాసేవారూ రాసే విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో కూడా భిన్నంగా ఉంటారట! ప్రపంచ జనాభాలో దాదాపు 12 శాతం మంది లెఫ్ట్ హాండ్ తో రాస్తారట.

ఇక ఆరోగ్యం విషయానికి వస్తే.. ఎడమ చేతితో వ్రాసే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో కుడిచేతితో రాసే వారి కంటే మెరుగ్గా ఉంటారు. అనేక వ్యాధులకు కూడా చాలా సున్నితంగా ఉంటారు. ఎడమచేతితో రాసే వ్యక్తులు తరచుగా రాత్రిపూట ఎక్కువ అశాంతికి గురవుతారు. లెఫ్ట్ హాండర్స్ బాగా నిద్రపోవాలి, ఎందుకంటే ఎక్కువశాతం వీరు నిద్రలేమి సమస్యతో కూడా బాధపడుతుంటారు.

ఎడమచేతితో రాసేవారిలో స్లీప్ వాకింగ్ సమస్య కూడా ఉంటుంది. ఓ పరిశోధన ప్రకారం.. ఎడమ చేతితో రాసే తొంభై  శాతం మంది వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఎడమచేతితో రాసేవారిలో మైగ్రేన్‌ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కుడిచేతితో రాసే వ్యక్తులు వారి కంటే రెండు రెట్లు తక్కువ మైగ్రేన్‌కు గురవుతారు.

 

ఎడమచేతితో రాసేవారిలో చాలామందికి వసంతకాలం ప్రారంభంలో ఏదో ఒక రకమైన అలర్జీ వస్తుంటుంది. వారు ఏ రకమైన అలెర్జీలకైనా ఇతర వ్యక్తుల కంటే పది శాతం ఎక్కువ సున్నితంగా ఉంటారు. ఈ వ్యక్తులకు ఇతర వ్యక్తుల కంటే ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. కాబట్టి ఎడమ చేతి వాటం వారు ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి సూచిస్తున్నారు వైద్యులు.