ఐపీఎల్ 2020 లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడా తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కే.ఎల్.రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. శుభమన్ గిల్ (57: 45 బంతుల్లో 3×4, 4×6) తో కలిసి నితీశ్ రాణా (0) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (7), దినేశ్ కార్తీక్ (0) స్కోర్ చేశారు. ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ (40: 25 బంతుల్లో 5×4, 2×6) చేయగా, సునీల్ నరైన్ (6), పాట్ కమిన్స్ (1), వరుణ్ చక్రవర్తి (2) చేశారు. చివరిలో లూకీ ఫెర్గూసన్ (24: 13 బంతుల్లో 3×4, 1×6) స్కోర్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 149/9 స్కోర్ చేసింది.పంజాబ్ జట్టు కెప్టెన్ కే.ఎల్.రాహుల్ (28: 25 బంతుల్లో 4×4) స్కోర్ చేశారు. క్రిస్‌ గేల్ (51: 29 బంతుల్లో 2×4, 5×6), మన్‌ దీప్ సింగ్ (66 నాటౌట్: 56 బంతుల్లో 8×4, 2×6) జోడీ రెండవ వికెట్‌ కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత నికోలస్ పూరన్ (2 నాటౌట్: 3 బంతుల్లో) స్కోర్ చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 150/2 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14

#15 #16


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com