Ads
బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజెబెత్ 2 భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి వృద్ధాప్య సమస్యలతో మరణించారు. క్వీన్ ఎలిజెబెత్ 70 సంవత్సరాలకు పైగా బ్రిటన్ కు రాణి గా ఉన్నారు.
Video Advertisement
ప్రపంచంలో అందరికి బ్రిటన్ రాజా కుటుంబీకుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. వీరికి సంబంధించిన ది రాయల్స్, ఎలిజెబెత్ అటు 90 అనే డాక్యూమెంటరీలు, వీరి పాత్రల ఆధారంగా వచ్చిన ది క్రౌన్, క్వీన్ వంటి చిత్రాలు మంచి ఆదరణను పొందాయి.
బ్రిటిష్ఈ వారి పాలనలో మనదేశం 200 సంవత్సరాలు మగ్గిపోయింది. కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనకు బ్రిటన్ కు మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మన దేశానికి, క్వీన్ ఎలిజిబెత్ కు ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం.
క్వీన్ ఎలిజెబెత్ తన తండ్రి కింగ్ జార్జ్ VI ఆకస్మిక మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్టించవలసి వచ్చింది. అప్పటికి భారత్ కు స్వాతంత్య్రం వచ్చి ఆరేళ్ళు. భయంకరమైన బ్రిటిష్ పాలన వాళ్ళ కలిగిన నష్టాలతో భారత్ అప్పటికీ పోరాడుతూనే ఉంది. ఆ తరువాత క్వీన్ భారత్ ను కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో సందర్శించి మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
హైదరాబాద్ నిజాం 1947లో క్వీన్స్ వివాహానికి ప్రసిద్ధ కార్టియర్ తలపాగాతో పాటు ఆమె ఎంపిక చేసుకున్న డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహ్వానం మేరకు క్వీన్ ఎలిజబెత్ II భారతదేశాన్ని మొదటిసారిగా 1961 రిపబ్లిక్ డే నాడు సందర్శించారు. ఈ సందర్భంగా జైపూర్ యువరాజు రాజ అతిథుల కోసం పులుల వేట నిర్వహించారు. రాణితో పాటు ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ కూడా ఉన్నారు.
క్వీన్ రెండవసారి భారతదేశాన్ని సందర్శించినప్పుడు 1983లో ప్రెసిడెంట్ గియానీ జైల్ సింగ్ రాజ దంపతులను ఆహ్వానించి, ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి భవన్‌లో వారికి ఆతిథ్యం ఇచ్చారు.. అప్పుడు క్వీన్ ఎలిజెబెత్ మదర్ థెరిసాను సమాజానికి చేసిన కృషికి ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’తో సత్కరించింది.
క్వీన్ మూడవ సందర్శన భారత్ లో అంత సజావుగా జరగలేదు. 50 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు క్వీన్ ఎలిజిబెత్ ను భారత్ కు ఆహ్వానించారు. అప్పుడు ఆమె ‘జలియన్ వాలా బాగ్’ ప్రాంగణంలో ప్రసంగించేందుకు సిద్ధపడగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 1963లో డాక్టర్ రాధాకృష్ణన్, 1990లో ఆర్. వెంకటరామన్ మరియు 2009లో ప్రతిభా పాటిల్‌లతో సహా భారతదేశం నుండి వచ్చిన అతిథులకు క్వీన్ ఎలిజెబెత్ ఆతిధ్యం ఇచ్చారు.
End of Article