అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో రాణించాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేసిన రాహుల్.. కోహ్లితో కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీ చేశాక మరుసటి బంతికే రాహుల్ ఔటయ్యాడు.
Video Advertisement
అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్య వేగంగా ఆడగా.. కోహ్లి నిలకడగా పరుగులు రాబట్టాడు. విరాట్ కోహ్లి ఫామ్‌ను కొనసాగిస్తూ అర్ధ శతకం నమోదు చేశాడు. వేగంగా ఆడిన సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఆఖర్లో దూకుడుగా ఆడిన అశ్విన్ 6 బంతుల్లో 13 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
గత మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసిన టస్కిన్ అహ్మద్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 15 రన్స్ మాత్రమే ఇచ్చినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. హసన్ మహ్ముద్ 3 వికెట్లు పడగొట్టగా.. షకీబుల్ హసన్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ ఏడు ఓవర్లలో 66 పరుగులు చేసింది. అంతరం వర్షం కారణం గా మ్యాచ్ తాత్కాలికంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేసింది.
అయితే ఈ మ్యాచ్ లో ఒక వ్యక్తి మాత్రం హైలైట్ గా నిలిచారు. అతనే రఘు. రఘు టీం ఇండియా సైడ్ ఆర్మ్ త్రోవర్ (విసిరేవాడు). మ్యాచ్ జరుగుతున్న సమయంలో చేతిలో ఒక బ్రష్ పట్టుకుని గ్రౌండ్ అంతా తిరుగుతూనే ఉన్నారు రఘు. అవుట్ ఫీల్డ్ జారిపోయే విధంగా ఉంది. అలాంటి సమయంలో ఒకవేళ కాలుజారితే ప్రమాదం ఉండే అవకాశం ఉంది అని టీం ఇండియా ప్లేయర్ల షూస్ తుడవడానికి రఘు బ్రష్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. దాంతో రఘుని అందరూ అభినందిస్తున్నారు.