Ads
ఐపీఎల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి, రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడా తో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో కే ఎల్ రాహుల్ (46: 41 బంతుల్లో 3×4, 2×6) తో కలిసి, మన్ దీప్ సింగ్ (0) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన క్రిస్‌గేల్ (99: 63 బంతుల్లో 6×4, 8×6) స్కోర్ చేశారు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన నికోలస్ పూరన్ (22: 10 బంతుల్లో 3×6) చేయగా, చివరిలో మాక్స్ వెల్ (6 నాటౌట్: 6 బంతుల్లో 1×4) చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లలో జోప్రా ఆర్చర్ రెండు వికెట్లు, బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 185 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ బెన్ స్టోక్స్ (50: 26 బంతుల్లో 6×4, 3×6) రాబిన్ ఉతప్ప (30: 23 బంతుల్లో 1×4, 2×6) తో కలిసి 5.3 ఓవర్లకి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత వచ్చిన సంజు శాంసన్ (48: 25 బంతుల్లో 4×4, 3×6) స్కోర్ చేశారు. చివరిలో స్టీవ్ స్మిత్ (31 నాటౌట్: 20 బంతుల్లో 5×4) చేయగా, జోస్ బట్లర్ (22 నాటౌట్: 11 బంతుల్లో 1×4, 2×6) చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 17.3 ఓవర్లలో 186/3 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4 #5
#6
#7
#8
#9
#10
#11
End of Article