ఈ సంవత్సరం అధిక మాసం రావడంతో చాలా పండుగలు కాస్త ఆలస్యంగా మొదలవుతున్నాయి. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. సోదర సోదరీమణుల ప్రేమ, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ లేదా రక్షా బంధన్ ను జరుపుకుంటారు.
Video Advertisement
అయితే ఈసారి ఈ పౌర్ణమి తిథి రెండు రోజులు ఉండడంతో ఏ రోజు రక్షా బంధన్ పండుగను జరుపుకోవాలనే విషయంలో ప్రజలలో గందరగోళం ఏర్పడింది. కొందరు రాఖీ పండగ ఆగస్టు 30న అని చెబుతుండగా, కొందరు ఆగస్టు 31న రాఖీ పండగ జరుపుకోవాలని చెబుతున్నారు. మరి ఏ రోజు రాఖీ కట్టడానికి మంచిదో ఇప్పుడు చూద్దాం..
సోదర సోదరీమణుల ప్రేమ, అనుబంధానికి గుర్తుగా రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి నాడు అక్కాచెల్లెల్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి, వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే ఈ ఏడాది వచ్చిన పౌర్ణమి తిథి ఆగస్ట్ 30వ తారీఖు 10 గంటల 58 నిముషాల నుండి 31 వ తారీఖు ఉదయం 7 గంటల 5 నిముషాల వరకు ఉంది.. రాఖీని మంచి ముహూర్తంలో కట్టడం వల్ల సోదరుడికి మంచి జరుగుతుందని, భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదని చెబుతున్నారు.
భద్రకాలంలో రాఖీ కడితే ఆ సోదరుడు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, భద్రకాలంలో సోదరుల చేతికి సోదరీమణులు రాఖీ కట్టకూడదని, భద్ర కాలం పూర్తి అయిన తర్వాతే రాఖీ కట్టాలని అంటున్నారు. భద్ర కాలం ఆగస్టు 30 బుధవారం ఉదయం 10:58 గంటలకు మొదలై రాత్రి 9:01 వరకు ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో సోదరులకు రాఖీ కట్టడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.
రాఖీ పండుగను రాత్రి9:02 గంటల నుంచి 12 వరకు జరుపుకోవచ్చని అంటున్నారు. అదే సమయంలో ఆగస్ట్ 31 రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తమని పలువురు పండితులు చెబుతున్నారు. ఆగస్ట్ 31రోజు ఉదయం 5 గంటల 58 నిముషాల నుండి 7 గంటల 5 నిముషాల వరకు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు.
Also Read: బ్రహ్మ ముందే తలరాతని వ్రాసేసారు కదా..? మరి ఎందుకు పూజలు చెయ్యడం..?