మన తలరాతని బ్రహ్మ వ్రాసారు అన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే బ్రహ్మ రాసిన తలరాతని ఎవరూ తప్పించలేరు కదా..? అలాంటప్పుడు మనం పూజ ఎందుకు చేయాలి..?, మంచి పనులు ఎందుకు చేయాలి…? ఇలాంటి అనుమానాలు మనలో చాలా కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు కూడా అనుకున్నారా బ్రహ్మ తలరాత రాసేశారు కదా మనం పూజలు చేయడం వల్ల ఫలితం ఏమిటి అని…? అయితే తల రాత రాసిన బ్రహ్మ అందులో ఒక మాట రాశాడట.

Video Advertisement

అదేంటంటే నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను. కానీ మీరు మీ ఉపవాసాలతో, మీ ఆలోచనలతో మార్చుకోవచ్చు అని అన్నారట. అర్చనలు, ఉపవాసాలు, కర్మకాండ ద్వారా మీ విధిని మీరు చేతుల్లో పెడుతున్నాను అని అన్నారట. ఉదాహరణకి బ్రహ్మ తలరాతని రాసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆయుష్షును వందేళ్లు రాస్తే చేసే పుణ్య పాపాలుని బట్టి అవి మారుతూ ఉంటాయి.

దీనితో ఆయువు తగ్గచ్చు పెరగొచ్చు కూడా. అయితే మన యొక్క ఆయువునే మార్చుకునే శక్తి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ అన్నారు. అలానే పురాణాలని శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది. అయితే ఒక కథ కూడా ఉంది ఆ కధని చూస్తే మీకు దీనికి సంబంధించి వివరాలు క్లుప్తంగా తెలుస్తాయి. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. అయితే ఆ రాజు యాభై ఏళ్ళకి మరణ గండం వుంది.

Also Read:   ఎవరు ఈ చక్రవర్తి “బింబిసార”..? ఆయన జీవితం వెనక ఉన్న రహస్యం ఏంటి..?

దానిని తప్పించుకోవాలని ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి ఆఖరికి బ్రతికాడు. ఇది చూసి జ్యోతిష్యులు ఆశ్చర్యపోయారు. అయితే అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నారు.. ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని అన్నారట.

అందుకనే బ్రహ్మ రాసిన రాత మార్చుకోవడానికి మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం వంటివి చేస్తే వాటిని మార్చుకోచ్చు. అందుకనే మనం పుణ్యం చేసుకోవాలి. ఆ పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతకచ్చు. అలా బ్రతికిన వారూ వున్నారు.

Also Read:  పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం దేనికి సంకేతమో తెలుసా? ఏమైనా కీడు జరుగుతుందా?