దేశం లోనే ఏకైక వింత రామాలయం.. లక్ష్మణుడు లేని ఈ రామాలయం ఎక్కడ ఉందంటే?

దేశం లోనే ఏకైక వింత రామాలయం.. లక్ష్మణుడు లేని ఈ రామాలయం ఎక్కడ ఉందంటే?

by Anudeep

Ads

భారత దేశంలో ప్రతి ఊరిలోనూ.. సందుకో రామాయలం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రామాలయాలలో సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమ విగ్రహాలు ఉంటాయి. కొన్ని రామాలయాలలో సీత, రామ లక్ష్మణ విగ్రహాలు ఉన్నా.. పక్కనే హనుమంతుడికి కూడా ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేయిస్తుంటారు.

Video Advertisement

అయితే.. లక్ష్మణుడు లేకుండా రామాలయం అన్న మాటే ఉండదు. ఏ రామాలయం అయినా అందులో లక్ష్మణుడికి కూడా విగ్రహం ఉండాల్సిందే. అనాదికాలంగా రామాలయ నిర్మాణాలలో లక్ష్మణుడికి కూడా విగ్రహం ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది.

indralvayi 2

ఎందుకంటే.. లక్ష్మణుడు శ్రీరాముని అడుగు జాడల్లోనే నడిచాడు. తండ్రి మాట తప్పలేక రాముడు అడవిబాట పడితే.. అన్నని వదిలి ఉండలేని లక్ష్మణుడి ఆ కష్టకాలంలో తోడుగా రాముని వెంటే నడిచాడు. అందుకే ప్రతి రామాలయంలోని లక్ష్మణుడి విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. అయితే.. దేశంలో ఒకే ఒక్క శ్రీ రాముని దేవాలయంలో మాత్రం లక్ష్మణుడు ఉండదు. ఆ దేవాలయం ఎక్కడ ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.

indralvayi 1

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో ఉన్న రామాలయంలో లక్ష్మణుడికి విగ్రహం ఉండదు. ఈ రామాలయంలో కేవలం సీత, రాముడు, హనుమంతుని విగ్రహాలు మాత్రమే ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ దాదాపు ముప్పై బ్రాహ్మణ కుటుంబాల అగ్రహారం ఉండేదని చరిత్ర చెబుతోంది. అప్పటి నిజాం నవాబులు హిందూ దేవాలయాలపై ఎన్ని దాడులు జరిపినప్పటికీ.. ఈ దేవాలయం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అందుకే అక్కడి వారు ఈ దేవాలయాన్ని ప్రత్యేకంగా భావిస్తుంటారు. దేశంలో లక్ష్మణుడు లేని ఏకైక దేవాలయం కావడంతో పలు ప్రాంతాలనుంచి భక్తులు విశేషంగా తరలివస్తుంటారు.


End of Article

You may also like