రాజకీయ చరిత్రను మార్చేసిన ముగ్గురు నేతలు ఒకే ఫోటోలో… ఆ ఫోటో వెనక కథ ఏంటంటే…?

రాజకీయ చరిత్రను మార్చేసిన ముగ్గురు నేతలు ఒకే ఫోటోలో… ఆ ఫోటో వెనక కథ ఏంటంటే…?

by Mounika Singaluri

Ads

సోషల్ మీడియా పుణ్యమా అంటు చరిత్రలో దాగి ఉన్న ఫోటోలు ఒక్కొక్కసారి బయటకు వస్తూ ఉంటాయి. ఆ ఫోటోలు చూసినప్పుడు దాని వెనకాల ఉన్న విషయం తెలుసుకోవాలని ఆసక్తి కూడా కలుగుతూ ఉంటుంది.1972వ సంవత్సరంలో భారత దేశ చరిత్రను మార్చేసిన ముగ్గురు వ్యక్తులు కలిసి విందు చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరో కాదు. పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, ఎంజి రామచంద్రన్.

Video Advertisement

ఆ సమయంలో ఒక ప్రత్యేక సందర్భంగా పీవీ నరసింహారావు మద్రాసు వెళ్లారు. అక్కడ ఆయనను ఎన్టీ రామారావు తన ఇంటికి ఆహ్వానించారు. అదే సమయంలో ఎంజి రామచంద్రాన్ కి కూడా ఎన్టీ రామారావు ఆహ్వానం పలికారు. ఇద్దరూ మంచి మిత్రులు కూడా.

సాంప్రదాయం, సంస్కృతి పట్ల గౌరవం ఉన్న ముగ్గురు కలిసి కుర్చీలు, డైనింగ్ టేబుల్ ఉన్న కూడా చాపపై కూర్చుని తమ చేతులతో తినడానికే ఇష్టపడేవారు. రాజకీయాలు, సినిమాల నుంచి సామాజిక సమస్యలు, వ్యక్తిగత విషయాల వరకు వివిధ అంశాల గురించి వారు సంభాషణలు చేసినట్లు కూడా సమాచారం ఉంది.వారు తమ అభిప్రాయాలను పంచుకుని ఒకరి అనుభవాల నుంచి ఒకరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఒకరు సాధించిన విజయాలను సమాజానికి చేసిన కృషిని గౌరవిస్తూ వారు తమ అభిమానాన్ని ప్రశంసలు కూడా వ్యక్తం చేసేవారు.

ప్రధానిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిపి ఒకచోట చేర్చిన ఈ విందు అరుదైన మరుపురాని సంఘటన. పీవీ నరసింహారావు 1991లో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. దేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచారు. ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకి గుర్తింపును అందించిన ఘనత ఎన్టీఆర్ ది.

ఎంజీ రామచంద్రన్ 1972లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజకంలో చేరారు. 1977లో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రజాకర్షణ గల నాయకుడిగా, బహుజన శ్రేయోభిలాషిగా గౌరవించబడ్డారు. సాధారణంగా సోషల్ మీడియాలో అర్థన విలువైన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. కొన్ని ఫోటోలు మనల్ని చరిత్రలోకి తీసుకువెళ్తాయి. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి మనుషులు ఎలా ఉండేవారు అని అవగాహన కల్పిస్తాయి.అలాంటి అరుదైన ఫోటోల్లో ఈ ఫోటో కూడా స్థానం సంపాదించుకుంటుంది.

Also Read:1971 నాటి కిరాణా షాప్ బిల్…అప్పటి సరుకుల ధరలు ఎంత ఉన్నాయో చూడండి.!


End of Article

You may also like